Share News

Indonesia Earthquake: ఇండోనేషియా సుమత్రా దీవుల్లో 6.3 తీవ్రతతో భూకంపం..

ABN , Publish Date - Nov 27 , 2025 | 12:49 PM

ఇప్పటికే తీవ్ర వరదలతో సతమతమవుతున్న సుమత్రా దీవుల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రతతో ఈ భూకంపం నమోదైంది. ఇండోనేషియా, 'రింగ్ ఆఫ్ ఫైర్' ప్రాంతంలో ఉండటంతో భూకంపాలు, తుఫానులు, వర్షాలు తరచూ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.

Indonesia Earthquake: ఇండోనేషియా సుమత్రా దీవుల్లో 6.3 తీవ్రతతో భూకంపం..
Indonesia Earthquake

ఇంటర్నెట్ డెస్క్: ఇండోనేషియా దేశంలోని సుమత్రా దీవులకు మరో ఉపద్రవం వచ్చిపడింది. గత కొన్ని రోజులుగా తుఫాను, భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతున్న సుమత్రా దీవుల్లో ఇప్పుడు భూకంపం సంభవించింది. ఈ రోజు (గురువారం) ఉదయం 6.3 తీవ్రత కలిగిన భూకంపం అక్కా ప్రాంతం సమీపంలో ఏర్పడింది. 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి.


అయితే, భూకంపం తీవ్రమైనది అయినప్పటికీ, సునామి ముప్పు లేదని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం నమోదు కాలేదు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉత్తర సుమత్రా ప్రాంతంలో భారీ వరదలు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ విపత్తుల వల్ల కనీసం 28 మంది ప్రాణాలు కోల్పోయారు. రోడ్లు, కమ్యూనికేషన్లు పూర్తిగా పాడయ్యాయి. దీంతో రక్షణ చర్యలు ఆలస్యం అవుతున్నాయని అధికారులు అంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రాణాలకు తెగించి నాగుపాముకు వైద్యం.. 2 గంటల పాటు..

మీకు తెలుసా.. రైలులో చేసే ఈ తప్పు వల్ల జైలు పాలవ్వడం ఖాయం..

Read Latest Telangana News and National News

Updated Date - Nov 27 , 2025 | 01:10 PM