PM Modi: మారిషస్‌లో కొత్త పార్లమెంటు నిర్మాణానికి భారత్ చేయూత: మోదీ
ABN , Publish Date - Mar 12 , 2025 | 02:47 PM
మారిషస్‌లో రెండ్రోజుల అధికారిక పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రి నవీన్ చంద్ర రామ్‌గులంతో కలిసి బుధవారంనాడు మీడియా సమావేశంలో మోదీ పాల్గొన్నారు. ఇండియా-మారిషస్ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.

పోర్ట్ లూయిస్: మారిషస్ (Mauritius) లో కొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి భారత్ సహకరిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) హామీ ఇచ్చారు. మారిషస్‌లో రెండ్రోజుల అధికారిక పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రి నవీన్ చంద్ర రామ్‌గులంతో కలిసి బుధవారంనాడు మీడియా సమావేశంలో మోదీ పాల్గొన్నారు. ఇండియా-మారిషస్ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసేందుకు తాను, నవీన్ చంద్ర కలిసి నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. మారిషస్‌లో కొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి ఇండియా సహకరిస్తుందని. ఇది మదర్ ఆఫ్ డెమోక్రసీ నుంచి మారిషస్‌కు ఇస్తున్న గిఫ్ట్ అని మోదీ అభివర్ణించారు.
PM Modi: మోదీకి మారిషస్ అత్యున్నత పురస్కారం
ఇరుదేశాల సంబంధాలు కేవలం హిందూ మహాసముద్రంతో ముడిపడటమే కాకుండా సంప్రదాయాలు, సంస్కృతీ పరంగా కూడా ఒకటేనని మోదీ చెప్పారు. ''ఆర్థిక, సామాజిక వృద్ధి ప్రయాణంలో మేము భాగస్వాములం. ఒకరికోసం ఒకరు ఎప్పుడూ నిలుస్తాం. ఆరోగ్యం, అంతరిక్షం, రక్షణ సహా ప్రతి రంగంలోనూ కలిసే ప్రయాణం సాగిస్తాం'' అని అన్నారు. మారిషస్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 140 కోట్ల భారతీయుల తరఫున అభినందనలు తెలియజేస్తున్నామని, మారిషస్ నేషనల్ డేన తాను ఇక్కడ ఉండటం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.
దీనికి ముందు, మారిషస్ మాజీ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నాత్‌ను మోదీ కలుసుకున్నారు. వివిధ రంగాల్లో ఇండియా-మారిషస్ మధ్య సహకారం పెంపుపై చక్కటి చర్చలు తమ మధ్య జరిగినట్టు మోదీ ఒక ట్వీట్‌లో తెలిపారు. మారిషస్ విపక్ష నేత, ఎంపీ జార్జి పైరె లెస్జాంగార్డ్‌ను కూడా ప్రధాని కలిసారు.
ప్రజలకు శుభాకాంక్షలు
మారిషస్ నేషనల్ డే సందర్భంగా దేశ ప్రజలకు మోదీ అభినందనలు తెలిపారు. ఈ సెలబ్రేషన్స్‌లో పాలుపంచుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు ట్వీట్ చేశారు. ఇంతవరకూ తన పర్యటనలోని హైలైట్స్‌ను కూడా వివరించారు. మారిషస్ పర్యటనలో తొలిరోజు ఆ దేశదేశాధ్యక్షుడు ధరమ్ గోకుల్‌తో మోదీ సమావేశమయ్యారు. అధ్యక్షుడు, ఆయన సతీమణికి అరుదైన బహుమతులను అందజేశారు. ప్రయాగ్‌రాజ్ ఇటీవల ముగిసిన మహా కుంభమేళా నుంచి తీసుకువెళ్లిన పవిత్ర గంగాజలాన్ని ధరమ్ గోకుల్‌కు అందించారు. వారణాసి నుంచి తీసుకువచ్చిన ప్రత్యేక బనారస్ చీరను హస్తకళాకారులు అందంగా తీర్చిదిద్దిన ఒక పెట్టెలో ఉంచి ధరమ్ గోకుల్ సతీమణి బృందా గోకుల్‌కు బహుకరించారు. అధ్యక్ష దంపతులకు ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డులను మోదీ అందజేశారు. మారిషస్ ప్రధానమంత్రి నవీన్ రామ్‌గులం చేతుల మీదుగా మారిషస్ ప్రభుత్వ అత్యున్నత పౌర పురస్కారం''ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్''ను మోదీ అందుకున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకున్న తొలి భారతీయుడు మోదీనే కావడం విశేషం. ఇండియా-మారిషస్ మధ్య సంబంధాల పటిష్టతకు చేసిన విశేష కృష్టికి గాను మోదీకి ఈ అవార్డును ప్రదానం చేశారు. దీంతో ఇంతవరకూ మోదీ అందుకున్న అంతర్జాతీయ పురస్కారాల సంఖ్య 21కి చేరింది. మారిషస్‌లో ప్రవాస భారతీయులను సైతం మోదీ కలుసుకున్నారు
ఇవి కూడా చదవండి
Trump: కెనడాపై సుంకాలు డబుల్
Ukraine Agree: కాల్పుల విరమణ ప్రతిపాదనకు ఉక్రెయిన్ అంగీకారం..
USA Deports Pak Diplomat: పాక్‌కు ఊహించని షాక్.. దౌత్యవేత్తకు అమెరికాలోకి అనుమతి నిరాకరణ
Read Latest and International News