S Jaishankar: మనసు విప్పి, నిజాయితీగా మాట్లాడుకుందాం: చైనాకు జైశంకర్ సూచన
ABN , Publish Date - Jul 14 , 2025 | 08:37 PM
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ 2024 అక్టోబర్‌లో సమావేశం జరిపిన తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాలు సానుకూల దిశగా సాగుతున్నాయని జైశంకర్ చెప్పారు. ఇదే విధంగా కొనసాగితే రెండు ఆసియన్ జెయింట్లకు పరస్పర ప్రయోజనం చేకూరుతుందన్నారు.

బీజింగ్: చైనా, భారత్ మధ్య గత తొమ్మిది నెలలుగా ద్వైపాక్షిక సంబంధాలలో పురోగతి సాధించామని, క్రమం తప్పుకుండా సమావేశాలు ఏర్పాటు చేసుకుని పరస్పరం చర్చించుకుంటే రెండు దేశాలకు మేలు జరుగుతుందని భారత విదేశాంగ మంత్రి జై శంకర్ (S Jaishnakar) అన్నారు. ఇప్పుడు నిర్బంధ వాణిజ్య చర్యలను నియంత్రించడం, అవరోధాలను తొలగించుకునే విషయంలో దృష్టి సారించాలని సూచించారు. చైనా పర్యటనలో భాగంగా జైశంకర్ ఆదేశ విదేశాంగ మంత్రి వాంగ్ యీ (Wang Yi)తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సరిహద్దు ఉద్రిక్తతలను పరిష్కరించుకుని, ఎల్ఏసీ వెంబడి శాంతి, సుస్ధిరత నెలకొనేందుకు ఇదే తగిన సమయమని అన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలు, వ్యూహాత్మక విధానంతో రెండు పొరుగుదేశాలు మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సంక్లిష్టతను అధిగమించి, ప్రాంతీయ సుస్థిరత పెంపునకు దౌత్యపరమైన చర్చలు తప్పనిసరని సూచించారు.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ 2024 అక్టోబర్‌లో సమావేశం జరిపిన తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాలు సానుకూల దిశగా సాగుతున్నాయని చెప్పారు. ఇదే విధంగా కొనసాగితే రెండు ఆసియన్ జెయింట్లకు పరస్పర ప్రయోజనం చేకూరుతుందన్నారు. గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ సంక్లిష్టతల నేపథ్యంలో మనసు పిప్పి, నిజాయితీగా మాట్లాడుకుంటే మంచి ఫలితాలు ఉంటాయన్నారు.
2020 జూన్‌లో ఇరు దేశాల మిలటరీ మధ్య తలెత్తిన ఉద్రిక్తతల అనంతరం ద్వైపాక్షిక సంబంధాలను పట్టాల మీదకు తెచ్చేందుకు ఇండియా-చైనా పలు చర్చలు తీసుకున్నాయని ఆయన గుర్తుచేశారు. ఈ ఏడాదితో భారత్, చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పడి 75 ఏళ్లు పూర్తవుతుందని, కైలాస్ మానసరోవర్ యాత్ర తిరిగి ప్రారంభమైనందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. పొరుగుదేశాలుగా, ప్రధాన ఆర్థిక వ్యవస్థలుగా ఉన్న ఇరుదేశాలు పరస్పరం అభిప్రాయాలు పంచుకోవడం చాలా కీలకమని అన్నారు. తాను జరుపుతున్న ఈ పర్యటనలో అలాంటి చర్చలు ఆశిస్తున్నట్టు చెప్పారు.
ఇవి కూడా చదవండి..
శుభాంశు శుక్లా టీం రిటర్న్ జర్నీ స్టార్ట్స్..
ఉక్రెయిన్, రష్యా యుద్ధం.. ట్రంప్ కీలక నిర్ణయం..
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి