Share News

Iran And Israel War: ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం.. ఇండియన్స్‌కు ఇజ్రాయెల్ క్షమాపణలు..

ABN , Publish Date - Jun 14 , 2025 | 11:40 AM

Iran And Israel War: ది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఓ మ్యాప్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే, ఆ మ్యాప్ ఇజ్రాయెల్‌ను విమర్శల పాలు చేసింది. ఆ మ్యాప్‌లో జమ్మూకాశ్మీర్ పాకిస్తాన్‌లో భాగం అన్నట్లుగా ఉంది. దీంతో సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది.

Iran And Israel War: ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం.. ఇండియన్స్‌కు ఇజ్రాయెల్ క్షమాపణలు..
Iran And Israel War

ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య తీవ్ర స్థాయిలో యుద్ధం నడుస్తోంది. రెండు దేశాలు మిస్సైల్స్, డ్రోన్లతో దాడులు చేసుకుంటున్నాయి. శుక్రవారం ఉదయం ఇరాన్ న్యూక్లియర్ సైట్లపై.. మిలటరీ బేస్‌లపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. నతాంజ్ న్యూక్లియర్ సైట్‌ను ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలోనే ది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) తమ అఫిషియల్ ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. దాడుల గురించి స్పందిస్తూ.. ‘ఇరాన్ ఈ ప్రపంచానికి ప్రమాదం. ఇజ్రాయెల్ దాని అంతిమ లక్ష్యంకాదు.. అది ఆరంభం మాత్రమే. మాకు ఇది తప్ప వేరే దారి లేదు’ అని పేర్కొంది.


ఓ మ్యాప్‌ను ఆ పోస్టులో షేర్ చేసింది. అయితే, ఆ మ్యాప్ ఇజ్రాయెల్‌ను విమర్శల పాలు చేసింది. ఆ మ్యాప్‌లో జమ్మూకాశ్మీర్ పాకిస్తాన్‌లో భాగం అన్నట్లుగా ఉంది. దీంతో భారత నెటిజన్లు ఇజ్రాయెల్ ఆర్మీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పోస్టుపై మండిపడుతూ కామెంట్లు చేయటం మొదలెట్టారు. ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహూనూ సైతం ట్యాగ్ చేస్తూ పోస్టులు పెట్టారు. దీంతో ఇజ్రాయెల్ ఆర్మీకి తాము చేసిన తప్పేంటో అర్థం అయింది. పొరపాటు జరిగిందని గుర్తించిన వెంటనే దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. క్షమాపణలు చెబుతూ మరో పోస్టు పెట్టింది.


ఆ ట్వీట్‌లో .. ‘ఈ పోస్టు కేవలం ఆ ప్రాంతాలకు సంబంధించిన ఉదాహరణ మాత్రమే. సరిహద్దుల్ని చక్కగా చూపించటంలో ఈ మ్యాప్ ఫెయిల్ అయింది. ఈ ఫొటో వల్ల ఏదైనా ఇబ్బంది కలిగిఉంటే మమ్మల్ని క్షమించండి’ అని పేర్కొంది. దీంతో ఇండియన్స్ కాస్త శాంతించారు. ‘ఈ సారి సరైన మ్యాప్‌ను పోస్టు చేయండి. మేము మీకు మద్దతుగా ఎప్పుడూ ఉంటాం’ అంటూ ఓ వ్యక్తి కామెంట్ పెట్టాడు. కాగా, ఇరాన్ చాలా ఏళ్ల నుంచి అణు బాంబులు తయారు చేయాలని చూస్తోంది. ఇందుకోసం బాగా శ్రమిస్తోంది. అయితే, ఇరాన్ అణుబాంబులు తయారు చేస్తే తమకు తీవ్ర నష్టం తప్పదని ఇజ్రాయెల్ భావిస్తోంది. అందుకే నిన్న ఇరాన్‌లోని న్యూక్లియర్ సైట్లపై దాడులు చేసింది.


ఇవి కూడా చదవండి

ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు

మరో పథకం రెడీ.. వారి ఖాతాల్లో పడనున్న డబ్బులు..

Updated Date - Jun 14 , 2025 | 12:11 PM