Benjamin Netanyahu: హమాస్ గాజా చీఫ్ సిన్వర్ హతం.. ఇజ్రాయెల్ ప్రధాని ప్రకటన
ABN , Publish Date - May 28 , 2025 | 09:17 PM
గత ఏడాది అక్టోబర్‌లో హతమైన హమాస్ మాజీ చీఫ్ యాహ్యా సిన్వర్ సోదరుడే మహమ్మద్ సిన్వర్. యాహ్యా సిన్వర్ హతం కావడతో మహమ్మద్ సిన్వర్ హమాస్ గాజా చీఫ్‌గా ఎన్నికయ్యాడు.

జెరూసలేం: ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య జరుగుతున్న భీకర యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాలస్తీనా హమాస్ గాజా చీఫ్ మహమ్మద్ సిన్వర్ (Mohammad Sinwar)ను తమ బలగాలు మట్టుబెట్టినట్టు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమన్ నెతన్యాహు (Benjamin Netanyahu) బుధవారంనాడు ప్రకటించారు. 'మహమ్మద్ డీఫ్, ఇస్మాయిల్ హనియే, యాహ్యా సిన్వర్ తరువాత ఇప్పుడు మహమ్మద్ సిన్వర్‌ను మనం మట్టుబెట్టాం' అని ఇజ్రాయెల్ పార్లమెంటులో నెతన్యాహు అధికారికంగా ప్రకటించారు. అయితే సిన్వర్ మరణాన్ని హమాస్ ఇంకా ధ్రువీకరించ లేదు.
గత ఏడాది అక్టోబర్‌లో హతమైన హమాస్ మాజీ చీఫ్ యాహ్యా సిన్వర్ సోదరుడే మహమ్మద్ సిన్వర్. యాహ్యా సిన్వర్ హతం కావడతో మహమ్మద్ సిన్వర్ హమాస్ గాజా చీఫ్‌గా ఎన్నికయ్యాడు. సదరన్ గాజాలో ఈనెల మొదట్లో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో సిన్వర్ చనిపోయినట్టు వార్తలు వచ్చినప్పటికీ అధికారికంగా ఇజ్రాయెల్ ధ్రువీకరించలేదు.
ఎవరీ సిన్వర్
యాహ్యా సిన్వర్ మరణాంతరం మహమ్మద్ సిన్వర్ గాజాలో మిలటరీ వింగ్, పొలిటికల్ కమాండ్ బాధ్యతలు చేపట్టాడు. హమహ్మద్ ఇబ్రహీం హసన్ సిన్వర్ గాజాలోని ఖాన్ యూనిస్ శరణార్థి శిబిరంలో జన్మించాడు. హమాస్ తరఫు సీక్రెట్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న కారణంగా ఆయనను 'ది షాడో'గా ఇజ్రాయెల్ అధికారులు చెబుతుంటారు. గ్రూప్‌లో కీలక వ్యక్తిగా ఉంటూ వచ్చిన సిన్వర్‌కు 2006లో ఇజ్రాయెల్ సైనికుడు గిలాడ్ షాలిత్ అహహరణలో కేసులో ప్రమేయం ఉంది. ఇజ్రాయెల్, పాలస్తీనా జైళ్లలో పలు సంవత్సరాలు గడిపిన సిన్వర్.. హమాస్ అధినాయకత్వంతో సంబంధాలు పెచుకుంటూ 1991లో హమాస్ మిలటరీ వింగ్‌లో చేరాడు. 2023 అక్టోబర్‌లో ఇజ్రాయెల్‌పై జరిగిన హమాస్ దాడులకు ప్రధాన పాత్రధారి కూడా ఆయనే.
ఇవి కూడా చదవండి..
Imran Khan: పాక్‌కు దెబ్బమీద దెబ్బ.. దేశవ్యాప్త ఆందోళనలకు ఇమ్రాన్ ఖాన్ పిలుపు
ఆ దేశానికి యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ ఆఫర్