Sheikh Hasina son: నా తల్లిని భారత్ రక్షించింది.. ప్రధాని మోదీకి రుణపడి ఉంటాం: షేక్ హసీనా కుమారుడు
ABN , Publish Date - Nov 20 , 2025 | 07:17 AM
గతేడాది బంగ్లాదేశ్‌లో విద్యార్థుల ఉద్యమం కారణంగా షేక్ హసీనా భారత్‌కు పారిపోయి వచ్చి తల దాచుకున్నారు. ఆ సమయంలో తన తల్లిని చంపేందుకు కుట్ర జరిగిందని, తల్లిని సకాలంలో భారత్ రక్షించిందని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సాజిద్ వాజేద్ పేర్కొన్నారు.
తన తల్లిని సకాలంలో భారత్ రక్షించిందని, ప్రధాని మోదీకి ఎప్పటికీ రుణపడి ఉంటానని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సాజిద్ వాజేద్ పేర్కొన్నారు. తన తల్లికి బంగ్లాదేశ్ ట్రైబ్యునల్ విధించిన మరణ శిక్ష రాజ్యాంగ విరుద్ధమని, అక్రమమని సాజిద్ అభిప్రాయపడ్డారు. గతేడాది బంగ్లాదేశ్‌లో విద్యార్థుల ఉద్యమం కారణంగా షేక్ హసీనా భారత్‌కు పారిపోయి వచ్చి తల దాచుకున్నారు. ఆ సమయంలో తన తల్లిని చంపేందుకు కుట్ర జరిగిందని సాజిద్ తాజాగా తెలిపారు (Sheikh Hasina assassination attempt).
'సంక్షోభ సమయంలో నా తల్లి ప్రాణాలను భారత్ కాపాడింది. బంగ్లాదేశ్‌ను వీడకపోయి ఉంటే మిలిటెంట్లు ఆమెను హత్య చేసేవారు. నా తల్లిని కాపాడినందుకు ప్రధాని మోదీ ప్రభుత్వానికి నేనెప్పుడూ రుణపడి ఉంటాను. బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం రాజ్యాంగ విరుద్ధమైన ప్రభుత్వం నడుస్తోంది. నా తల్లిని దోషిగా నిర్ధారించేందుకు చట్టాలను సవరించారు. విచారణకు ముందే 17 మంది న్యాయమూర్తులను తొలగించి ఎలాంటి అనుభవం లేని కొత్త వ్యక్తులను ధర్మాసనంలో నియమించారు' అని సాజిద్ విమర్శించారు (PM Modi India role).
ప్రస్తుతం బంగ్లాదేశ్ లష్కరే తోయిబా ఉగ్రవాదుల అడ్డాగా మారిందని, ఆ ఉగ్రవాద సంస్థకు యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం అండదండలు అందిస్తోందని సాజిద్ తెలిపారు (India Bangladesh relations). షేక్ హసీనా అప్పగింత విషయంలో ఇంటర్‌పోల్ సహాయాన్ని అభ్యర్థించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే తన తల్లి అప్పగింత విషయంలో న్యాయ ప్రక్రియను అనుసరించాలని, న్యాయవాదులను పెట్టుకునేందుకు తన తల్లికి అనుమతి ఇవ్వాలని సాజిద్ డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి:
ఈడీ కస్టడీకి అల్-ఫలాహ్ యూనివర్సిటీ చైర్మన్..
ఆత్మాహుతి అంటే బలిదానం.. వెలుగులోకి ఢిల్లీ పేలుళ్ల నిందితుడి సెల్ఫీ వీడియో..