Share News

Viral Video: ట్రక్స్ రాగానే ఈగల్లా చుట్టుముట్టిన జనం.. మరీ దారుణంగా..

ABN , Publish Date - Jul 30 , 2025 | 05:57 PM

Viral Video: హాలీవుడ్‌లో ‘మ్యాడ్ మ్యాక్స్ : ఫ్యూరీ రోడ్’ అనే సినిమా ఉంటుంది. 2015లో విడుదలైన ఈ సినిమాలో నీటి కోసం ప్రజలు అల్లాడిపోతుంటారు. ప్రజల నాయకుడు నీటిని విడుదల చేసినపుడు గుంపు, గుంపులుగా జనాలు నీళ్ల కోసం ఎగబడతారు.

Viral Video: ట్రక్స్ రాగానే ఈగల్లా చుట్టుముట్టిన జనం.. మరీ దారుణంగా..
Viral Video

ఇజ్రాయెల్, పాలస్తీనా దేశాల మధ్య యుద్ధం కొన్ని కోట్ల మంది ప్రజల్ని నరకంలోకి తోసేసింది. 2023, అక్టోబర్ 7వ తేదీన మొదలైన యుద్ధం కారణంగా పాలస్తీనాలో ఇప్పటి వరకు 60 వేల మంది చనిపోయినట్లు గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. పాలస్తీనాలో ప్రజల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. యుద్ధం వల్ల కరువులాంటి పరిస్థితి నెలకొంది. ప్రజలు ఆకలి చావులు చస్తున్నారు. ఒక్క గాజాలోనే 4,70,000 మంది ప్రజలు తినడానికి సరైన తిండిలేక అల్లాడిపోతున్నారు. వీరిలో 5 సంవత్సరాలకంటే తక్కువ వయసు ఉన్న వారు 71వేల కంటే ఎక్కువ మంది ఉన్నారు.


ప్రభుత్వం ప్రజలకు ఆహారం అందించే విషయంలోనూ ప్రాణాలు బలి అవుతున్నాయి. ఆహారం కోసం జనం ఒక్కసారిగా ఎగబడుతుండటంతో.. తొక్కిసలాట జరుగుతోంది. ఆహారం పంపిణీ జరిగే దగ్గర తొక్కిసలాట జరిగి దాదాపు 1060 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. ఇక, సరైన తిండి లేక 20 వేల మంది చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. వీరిలో 3 వేలకుపైగా చిన్నారులు తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. గాజాలో కరువు లాంటి పరిస్థితి కనిపిస్తోంది.


ఈగల్లా ఎగబడ్డ జనం..

హాలీవుడ్‌లో ‘మ్యాడ్ మ్యాక్స్ : ఫ్యూరీ రోడ్’ అనే సినిమా ఉంటుంది. 2015లో విడుదలైన ఈ సినిమాలో నీటి కోసం ప్రజలు అల్లాడిపోతుంటారు. ప్రజల నాయకుడు నీటిని విడుదల చేసినపుడు గుంపు, గుంపులుగా జనాలు నీళ్ల కోసం ఎగబడతారు. ఈ సినిమాలో నీటి కోసం ప్రజలు ఎగబడితే.. గాజాలో తిండి కోసం ఎగబడుతున్నారు. గాజాలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పే ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో..ఫుడ్ ట్రక్స్ రాగానే వందలాది మంది జనం ట్రక్స్‌పై పడ్డారు. ఈగల్లా వాటిని చుట్టుముట్టి సరుకుల్ని పట్టుకెళ్లిపోయారు. ఆ దృశ్యాలు చూస్తే అయ్యో పాపం అనిపిస్తుంది.


ఇవి కూడా చదవండి

రోజు రోజుకు పెచ్చు మీరుతున్న దర్శన్ ఫ్యాన్స్ ఆగడాలు..

అదృష్టం అంటే ఈమెదే.. కొంచెం ఉంటే ప్రాణాలు పోయేవి..

Updated Date - Jul 30 , 2025 | 10:01 PM