Macron Love Story: ఆమెకు 72.. అతడికి 47.. ఫ్రాన్స్ అధ్యక్షుడి లవ్‌స్టోరీ తెలిస్తే షాకవ్వాల్సిందే..
ABN , Publish Date - May 28 , 2025 | 05:23 PM
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రన్‌ను అతడి భార్య బ్రిగెట్టా చెంపదెబ్బ కొట్టిన వీడియో ఒకటి అంతర్జాతీయ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వియత్నాం పర్యటనలో జరిగిన ఈ ఘటన వారి ప్రేమకథను వెలుగులోకి తీసుకొచ్చింది. వారి ప్రేమకథ గురించి తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం.

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రన్ (Emmanuel Macron)ను అతడి భార్య బ్రిగెట్టా (Brigitte Macron) చెంపదెబ్బ కొట్టిన వీడియో ఒకటి అంతర్జాతీయ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వియత్నాం పర్యటనలో జరిగిన ఈ ఘటన వారి ప్రేమకథను వెలుగులోకి తీసుకొచ్చింది. వారి ప్రేమకథ గురించి తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. ఎందుకంటే వారిద్దరికీ వయసులో 14 ఏళ్లు తేడా ఉంది. మాక్రన్‌కు చదువు చెప్పిన టీచర్ బ్రిగెట్టా. తన కూతురు వయసున్న మాక్రన్‌ను బ్రిగెట్టా వివాహం చేసుకుంది (Macron Love Story).
1993లో ఫ్రాన్స్‌లోని అమియెన్స్ పట్టణంలోని ఓ హైస్కూల్‌లో బ్రిగెట్టా టీచర్‌గా పని చేసేవారు. అప్పటికి ఆమె వయసు 39 ఏళ్లు. అప్పటికే ఆమెకు ఓ బ్యాంకర్‌తో వివాహం జరిగింది. ముగ్గురు కుమార్తెలు కూడా ఉన్నారు. ఆమె పెద్ద కుమార్తె వయసు అప్పటికి 15 ఏళ్లు. అదే వయసున్న మాక్రన్.. బ్రిగెట్టా పని చేసే స్కూలులో చదువుకునే వారు. భర్తకు విడాకులు ఇచ్చేసిన తర్వాత మాక్రన్‌కు బ్రిగెట్టా చేరువయ్యారు. 15 ఏళ్ల వయసుకే మాక్రన్ 25 ఏళ్ల యువకుడిలా ప్రవర్తించేవారట. చాలా మెచ్యూర్డ్‌గా ఉండేవారట. ఇద్దరూ కలిసి తిరిగేవారు.
కొద్దికాలం తర్వాత మాక్రన్ పారిస్ వెళ్లిపోయినా బ్రిగెట్టాతో సంబంధాన్ని కొనసాగించారు. చివరకు 2007లో మాక్రన్, బ్రిగెట్టా వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన మాక్రన్ 2014లో ఫ్రాన్స్ ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో మాక్రన్‌కు సపోర్ట్ చేయడం కోసం బ్రిగెట్టా తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. మాక్రన్‌కు సహాయకంగా ఉండిపోయారు. వయసులో ఎక్కువ తేడా ఉన్నా వీరి ప్రేమ మాత్రం ఇప్పటికీ చెక్కు చెదరలేదు.
తాజా వివాదం గురించి కూడా మాక్రన్ వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. విమానంలో తన భార్య తనను కొట్టినట్టూ అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారని, అయితే అది తమ మధ్య సరదా సన్నివేశం అని మాక్రన్ వివరణ ఇచ్చారు. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని, మీడియా అనవసరం కథలు అల్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
ఫ్రాన్స్ అధ్యక్షుడిని కొట్టిన భార్య? వైరల్ అవుతున్న వీడియో చూస్తే
ఆ దేశానికి యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ ఆఫర్
మరిన్ని అంతర్జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..