Share News

Fiery Plane Crash: పిట్టలా రోడ్డుపై కుప్పకూలిన మినీ విమానం..

ABN , Publish Date - Jul 25 , 2025 | 08:57 PM

Fiery Plane Crash: ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే కాలి బూడిద అయ్యారు. రోడ్డుపై వెళుతున్న ఇద్దరు బైకర్లు తీవ్రంగా గాయపడ్డారు.

Fiery Plane Crash: పిట్టలా రోడ్డుపై కుప్పకూలిన మినీ విమానం..
Fiery Plane Crash

ఈ మధ్య కాలంలో విమాన ప్రమాదాలు చాలా ఎక్కువై పోయాయి. పెద్ద సంఖ్యలో జనాలు ప్రాణాలు కోల్పోతున్నారు. గురువారం రష్యాలో విమాన ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దాదాపు 49 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సంఘటన మరువక ముందే మరో విమాన ప్రమాదం వెలుగుచూసింది. ఓ మినీ విమానం పిట్టలా రోడ్డుపై కూలిపోయింది. ఈ సంఘటన ఇటలీలో మంగళవారం చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..


నార్తర్న్ ఇటలీ, బ్రెసియాకు చెందిన 75 ఏళ్ల లాయర్ తన భార్య 60 ఏళ్ల ఆన్ మారియా డె స్టెఫనో కలిసి మినీ విమానంలో వెళుతూ ఉన్నాడు. విమానం గాల్లో ఉండగా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పైలట్‌ సెర్జియో రవగ్లియా విమానాన్ని హైవేపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాలని చూశాడు. అయితే, అది సాధ్య పడలేడు. విమానం అత్యంత వేగంగా రోడ్డుపై పడింది. పడిన వెంటనే పేలిపోయింది. భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. అదే సమయంలో వెళుతున్న కొన్ని కార్లు మంటల్లో చిక్కుకున్నాయి.


ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే కాలి బూడిద అయ్యారు. రోడ్డుపై వెళుతున్న ఇద్దరు బైకర్లు తీవ్రంగా గాయపడ్డారు. ఇక, సమాచారం అందుకున్న ఎమర్జెన్సీ సేవల సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల్ని అదుపులోకి తేవటంతో పాటు.. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. ఇక, నేషనల్ ఎజెన్సీ ఫర్ ఫైట్ సేఫ్టీ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టింది. ఓ కన్‌సల్టెంట్‌ను బ్రెసియాకు పంపింది.


ఇవి కూడా చదవండి

ఉపేంద్ర హీరో అవ్వడానికి కారణం ఈ సీనియర్ హీరోయినే..

బెంజి కారుపై డ్యాన్స్.. చిక్కుల్లో ముంబై కపుల్

Updated Date - Jul 25 , 2025 | 09:14 PM