Elon Musk: మస్క్‌ను కలవరపెడుతున్న మరో సమస్య.. మస్క్‌కు సూర్యుడి దెబ్బ..
ABN , Publish Date - Jun 09 , 2025 | 08:37 AM
Elon Musk Starlink: అమెరికాలో స్టార్ లింక్ సేవలు అందుబాటులో ఉన్నాయి. స్టార్ లింక్ ఇంటర్ నెట్ సేవల కోసం మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ పెద్ద సంఖ్యలో శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపింది. అయితే, భూకక్ష్యలో ఉన్న స్టార్ లింక్ శాటిలైట్లు గత కొన్నేళ్ల నుంచి కిందకు పడిపోతున్నాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో విభేదాలతో ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ సతమతమవుతున్నారు. ఇద్దరి మధ్యా గొడవలు రోజు రోజుకు పెరుగుతున్నాయే తప్ప తగ్గటం లేదు. ట్రంప్‌కు బుద్ధి చెప్పాలన్న ఉద్దేశ్యంతో మస్క్ చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే.. ట్రంప్‌తో గొడవలతో ఇబ్బందిపడుతున్న మస్క్‌కు సూర్యుడు షాక్ ఇస్తున్నాడు. కోట్ల రూపాయల నష్టం తెస్తున్నాడు. ఒకరకంగా స్టార్ లింక్ ప్రాజెక్టును దెబ్బ తీస్తున్నాడు. ఇంతకీ సంగతేంటంటే.. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్ నెట్ సేవలు అందించడానికి మస్క్ స్టార్ లింక్ ప్రాజెక్టును చేపట్టారు.
అమెరికాలో స్టార్ లింక్ సేవలు అందుబాటులో ఉన్నాయి. స్టార్ లింక్ ఇంటర్ నెట్ సేవల కోసం మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ పెద్ద సంఖ్యలో శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపింది. అయితే, భూకక్ష్యలో ఉన్న స్టార్ లింక్ శాటిలైట్లు గత కొన్నేళ్ల నుంచి కిందకు పడిపోతున్నాయి. భూమి వాతావరణంలోకి వచ్చేస్తున్నాయి. సూర్యుడి వేడి దీనికి కారణం కావటం గమనార్హం. సూర్యుడి వేడి కారణంగా తరచుగా భూ అయస్కాంత తుఫానులు వస్తున్నాయి. వీటి కారణంగా భూకక్ష్యలో ఉన్న శాటిలైట్లు భూవాతావరణంలోకి పడిపోతున్నాయి.
ఊహించిన దానికంటే ముందుగానే శాటిలైట్లు భూవాతావరణంలో పడిపోతున్నాయి. 2020 నుంచి 2024 మధ్య కాలంలో ఏకంగా 523 స్టార్ లింక్ శాటిలైట్లు భూవాతావరణంలోకి వచ్చేసినట్లు నాసా తెలిపింది. స్పేస్ ఎక్స్ మొత్తం 8,873 స్టార్ లింక్ శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపింది. వాటిలో ప్రస్తుతం 7,669 మాత్రమే పని చేస్తున్నాయి. స్పేస్ ఎక్స్ తయారు చేసిన శాటిలైట్ల జీవిత కాలం చాలా తక్కువ. అవి భూకక్ష్యలో కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే ఉంటాయి. తర్వాత భూమి వాతావరణంలోకి పడిపోతాయి. భూమిని చేరేకంటే ముందే కాలి బూడిద అయిపోతాయి. కానీ, సూర్యుడి కారణంగా ఐదేళ్ల కంటే ముందే శాటిలైట్లు భూవాతావరణంలో పడిపోతున్నాయి. దీని వల్ల మస్క్‌కు భారీ నష్టం వస్తోంది.
ఇవి కూడా చదవండి
అదృష్టం అంటే ఇతడిదే.. తండ్రి చేసిన పనితో లైఫ్ సెటిల్..
ప్రేమలో విఫలం.. ఊహించని నిర్ణయం తీసుకున్న మోడల్..