Share News

Dubai Crown Prince: దుబాయ్ యువరాజు అంటే ఆ మాత్రం ఉండాలి.. రెస్టారెంట్‌కు వెళితే..

ABN , Publish Date - Jun 29 , 2025 | 10:18 AM

దుబాయ్ క్రౌన్ ప్రిన్స్‌ను ముద్దుగా 'ఫజా' అని పిలుస్తుంటారు. ఆ పదానికి అరబిక్‌లో సహాయం చేసేవాడని అర్థం. తన పేరుకు సార్థకత చేకూర్చేలా క్రౌన్ ప్రిన్స్ వ్యవహరించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఫజా తాజాగా అబుదాబీ యువరాజుతో కలిసి స్థానికంగా ఉన్న ఓ ఖరీదైన రెస్టారెంట్‌కు వెళ్లి అక్కడున్న అందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చారు.

Dubai Crown Prince: దుబాయ్ యువరాజు అంటే ఆ మాత్రం ఉండాలి.. రెస్టారెంట్‌కు వెళితే..
Dubai Crown Prince

దుబాయ్ (Dubai) క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూం మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్‌ (Dubai Crown Prince)ను ముద్దుగా 'ఫజా' (Fazza) అని పిలుస్తుంటారు. ఆ పదానికి అరబిక్‌లో సహాయం చేసేవాడని అర్థం. తన పేరుకు సార్థకత చేకూర్చేలా క్రౌన్ ప్రిన్స్ వ్యవహరించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఫజా తాజాగా అబుదాబీ యువరాజుతో కలిసి స్థానికంగా ఉన్న ఓ ఖరీదైన రెస్టారెంట్‌కు వెళ్లి అక్కడున్న అందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చారు.


అబుదాబి యువరాజు, కొంతమంది స్నేహితులతో కలిసి ఫజా ఆ రెస్టారెంట్‌కు వెళ్లారు. యువరాజుల రాకను చూసి అక్కడున్న వారందరూ అవాక్కయ్యారు. భోజనం చేసిన తర్వాత ఫజా అక్కడున్న అందరి బిల్లులను చెల్లించి సర్‌ప్రైజ్ ఇచ్చారు. మొత్తం అందరి బిల్లులు కలిపి రూ.7లక్షలు అయినట్టు తెలుస్తోంది. దీంతో అక్కడున్న అందరూ ఎంతో సంబరపడ్డారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాతృత్వంలో తండ్రి షేక్ మహమ్మద్ వారసత్వాన్ని నిలబెట్టేలా ఫజా వ్యవహరిస్తున్నారని నెటిజన్లు కామెంట్లు చేశారు.


2006 నుంచి 2008 వరకు షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ డిప్యూటీగా కొనసాగారు. 2008లో దుబాయ్ క్రౌన్ ప్రిన్స్‌గా నియమితులయ్యారు. కవిత్వం, సాహస క్రీడలు, పర్యావరణం, దాతృత్వంపై ఫజా ఎక్కువగా మక్కువ చూపిస్తారు. ఆయన సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్‌గా ఉంటారు. అతని ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 17 మిలియన్ల మందికి పైగా ఫాలో అవుతుంటారు.


ఇవీ చదవండి:

కెనడాపై ట్రంప్ ఆగ్రహం.. వాణిజ్య చర్చలు ముగిస్తున్నట్టు ప్రకటన

ట్రంప్ వీసా ఆంక్షలతో వైద్య సిబ్బంది కొరత.. అందోళనలో అమెరికా ఆసుపత్రులు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 29 , 2025 | 10:39 AM