Share News

Pregnancy Humanoid: చైనా అద్భుత సృష్టి.. ఇకపై రోబోలు కూడా పిల్లల్ని కంటాయి..

ABN , Publish Date - Aug 16 , 2025 | 11:25 AM

Pregnancy Humanoid: సాధారణంగా పిల్లలు కనడంలో ఇబ్బంది ఉన్న భార్యాభర్తలు సరోగసిని ఆశ్రయిస్తూ ఉంటారు. సరోగసిలో భాగంగా.. భార్యాభర్తల నుంచి శుక్రకణాలు, అండాలను సేకరించి వేరే మహిళ గర్భం ద్వారా పిల్లలను కనేలా చేస్తారు.

Pregnancy Humanoid: చైనా అద్భుత సృష్టి.. ఇకపై రోబోలు కూడా పిల్లల్ని కంటాయి..
pregnancy humanoid

శాస్త్ర సాంకేతికత విషయంలో చైనా అన్ని దేశాల కంటే ఓ అడుగు ముందు ఉంటుంది. అన్ని విషయాల్లో దేవుడి సృష్టికి ప్రతి సృష్టి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంది. కొన్నిటిలో విజయం కూడా సాధించింది. ఈ నేపథ్యంలోనే ‘ప్రెగ్నెన్సీ రోబో’ను రూపొందిస్తోంది. సాధారణంగా పిల్లలు కనడంలో ఇబ్బంది ఉన్న భార్యాభర్తలు సరోగసిని ఆశ్రయిస్తూ ఉంటారు. సరోగసిలో భాగంగా.. భార్యాభర్తల నుంచి శుక్రకణాలు, అండాలను సేకరించి వేరే మహిళ గర్భం ద్వారా పిల్లలను కనేలా చేస్తారు.

Pregnancy Humanoid


ఇది బాగా ఖర్చుతో కూడుకున్న పని. పైగా ఇండియాలో వాణిజ్య సరోగసి బ్యాన్‌లో ఉంది. చైనా ప్రయోగం సక్సెస్ అయితే మాత్రం సరోగసి కోసం వేరే మహిళలు అవసరం లేదు. రోబోలే మనుషుల పిల్లల్ని కంటాయి. చైనాకు చెందిన కైవా టెక్నాలజీ ఈ అద్భుత సృష్టికి తెరతీసింది. రోబోలు మనుషుల పిల్లల్ని ఎలా కంటాయన్న అనుమానం అక్కర్లేదు. ఆ రోబోల్లో కృత్తిమ గర్భాశయాన్ని ఏర్పాటు చేస్తారు. అందులో అండం వృద్ధి చెందుతుంది. 9 నెలల తర్వాత బయటకు వస్తుంది.

Pregnancy Humanoid


రోబో గర్భంలో బిడ్డ పెరుగుతున్నంత వరకు పైపు ద్వారా పోషకాలను అందిస్తారు. ఈ ప్రోటోటైప్ వచ్చే ఏడాది మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ ప్రెగ్నెన్సీ రోబోల ధర లక్ష యూవాన్లు. అదే మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 11 లక్షల రూపాయలుపైనే ఉంటుంది. కైవా టెక్నాలజీ అధినేత డాక్టర్ హాంగ్ కీఫెంగ్ మాట్లాడుతూ.. ‘కృత్తిమ గర్భాశయం తయారీ ఇప్పటికే పూర్తయింది. దాన్ని రోబో కడుపులో అమర్చి పరీక్ష చేయటం మాత్రమే బాకీ ఉంది. ఇకపై మనుషులు, రోబోలు కలిసి పిల్లల్ని కనొచ్చు. న్యాయ పరమైన, సమాజపరమైన సమస్యలకు సంబంధించి ప్రభుత్వ అధికారులతో చర్చలు జరుపుతున్నాము’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

సత్యసాయి జిల్లాలో ఉగ్రవాదుల కలకలం

పుతిన్, ట్రంప్ మీటింగ్.. ఆకాశంలో దూసుకెళ్లిన బీ 2 బాంబర్

Updated Date - Aug 16 , 2025 | 12:52 PM