Share News

China India Relations: షక్సగాంలో చైనా చొరబాటు

ABN , Publish Date - Aug 02 , 2025 | 05:41 AM

సరిహద్దు ప్రాంతాల్లోని భారత భూభాగంలో చైనా అక్రమ చొరబాట్లు కొనసాగుతూనే ఉన్నాయి. భారత్‌కు వ్యూహాత్మక

China India Relations: షక్సగాంలో చైనా చొరబాటు

  • లోయలో ముమ్మరంగా రోడ్ల నిర్మాణం

  • వెల్లడించిన ఉపగ్రహ ఛాయా చిత్రాలు

  • అక్సాయ్‌చిన్‌ హైవేతో కలిపేలా రహదారి

  • షక్సగాం.. భారత్‌కు వ్యూహాత్మక ప్రాంతం

న్యూఢిల్లీ ఆగస్టు 1: సరిహద్దు ప్రాంతాల్లోని భారత భూభాగంలో చైనా అక్రమ చొరబాట్లు కొనసాగుతూనే ఉన్నాయి. భారత్‌కు వ్యూహాత్మక ప్రాంతమైన షక్సగాం వ్యాలీలో డ్రాగన్‌ కంట్రీ రోడ్ల నిర్మాణంతోపాటు మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తోంది. అత్యంత క్లిష్టమైన ఈ లోయలో చైనా చేపట్టిన రహదారి విస్తరణ, మౌలిక సదుపాయాల పనులను ఉపగ్రహ ఛాయా చిత్రాలు స్పష్టం చేశాయి. షక్సగాంలో చేపట్టిన కొత్త రోడ్డు.. చైనాలోని అక్సాయ్‌చిన్‌(జీ219) జాతీయ రహదారిని కలుపుతుంది. వాస్తవానికి షక్సగాం వ్యాలీ భారత్‌ పరిధిలో, ఉత్తర లడఖ్‌లోని సియాచిన్‌కు సమీపంలోనే ఉంది. అయితే.. 1963లో పాకిస్థాన్‌ ఓ ఒప్పందం ద్వారా దీనిని చైనాకు అప్పగించింది. ఫలితంగా అప్పటి నుంచి ఈ లోయపై చైనా నియంత్రణే కొనసాగుతోంది. కానీ, సదరు ఒప్పందాన్ని భారత్‌ తిప్పికొడుతోంది. దీనిని చట్టవిరుద్ధమని పేర్కొంటోంది. కాగా, ప్రస్తుత ఉపగ్రహ ఛాయా చిత్రాలపై ఓపెన్‌-సోర్స్‌ ఇంటెలిజెన్స్‌ విశ్లేషకుడు నాథన్‌ రూసర్‌, పరిశోధకులు నేత్రా దేశాయ్‌ స్పందిస్తూ.. అత్యంత క్లిష్టమైన షక్సగాంలో చైనా రహదారుల నిర్మాణం చేపడుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు.

Updated Date - Aug 02 , 2025 | 07:48 AM