Car Bomb: బలూచిస్తాన్‌లో పేలిన కారు బాంబు.. నలుగురు మృతి.. 20 మందికిపైగా గాయాలు
ABN , Publish Date - May 19 , 2025 | 05:32 PM
Car Bomb: పాకిస్థాన్ ప్రభుత్వానికి సంబంధించిన నాయకుడు ఫైజుల్లా ఘబిజాయ్‌ని కూడా లక్ష్యంగా చేసుకుని దాడి జరిగినట్లు సమాచారం. ఈ దాడిలో ఆయనకు ఏమీ కాలేదు. ఆయన భద్రతా సిబ్బంది ఒకరు చనిపోగా.. మిగిలిన వారు బాంబు దాడిలో గాయపడ్డారు.

పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో కారు బాంబు పేలింది. ఖిలా అబ్దుల్లాలో చోటుచేసుకున్న ఈ పేలుడులో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో 20 మంది గాయపడ్డారు. 20 మందిలో 8 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గులిస్తాన్ టౌన్‌లోని ‘పాకిస్థాన్ ఫ్రంటైర్ కాప్స్’ భవనం లక్ష్యంగా ఈ కారు బాంబు దాడి జరిగింది. భారీ స్థాయిలో బాంబు పేలుడు సంభవించటంతో ఫ్రంటైర్ కాప్స్ భవనం దగ్గర ఉన్న చాలా షాపులు, వాహనాలు ధ్వంసం అయ్యాయి.
పాకిస్థాన్ ప్రభుత్వానికి సంబంధించిన నాయకుడు ఫైజుల్లా ఘబిజాయ్‌ని కూడా లక్ష్యంగా చేసుకుని దాడి జరిగినట్లు సమాచారం. ఈ దాడిలో ఆయనకు ఎటువంటి గాయాలు కాలేదు. ఆయన భద్రతా సిబ్బంది ఒకరు చనిపోగా.. మిగిలిన వారు బాంబు దాడిలో గాయపడ్డారు. ఇక, ఈ సంఘటనపై ఖిలా అబ్దుల్లా డిప్యూటీ కమిషనర్ మహ్మద్ రియాజ్ దావర్ మాట్లాడుతూ.. ‘ ఫ్రంటైర్ కాప్స్ గోడను టార్గెట్ చేసి దుండగులు బాంబు దాడి చేశారు. బాంబు పేలుడు తర్వాత భద్రతా దళాలు, దుండగులకు మధ్య కాల్పులు జరిగాయి.
దుండగులు ఇంప్రవైజుడ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్(ఎల్ఈడీ)ని కారులో బిగించి దాడి చేశారు. కారును రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేసినట్లుగా కనిపిస్తోంది’ అని అన్నారు. ఇక, ఈ దాడిపై తెహ్రీక్ ఈ తాలిబన్ పాకిస్థాన్ సభ్యులు స్పందించారు. పాకిస్థాన్ ఫ్రంటైర్ కాప్స్ భవనం దగ్గర దాడికి పాల్పడింది తామేనని ప్రకటించారు. ఈ దాడిపై కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. బాంబు దాడి నేపథ్యంలో ఖిలా అబ్దుల్లా, చామన్ ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు.
ఇవి కూడా చదవండి
Shilpa Shirodkar: సూపర్ స్టార్ మహేష్ బాబు మరదలికి కోవిడ్
Great Man Marulayya: చరిత్ర మర్చిపోయిన వీరుడు.. 6 వేల శవాలకు అంత్యక్రియలు చేశాడు..