Share News

Canteen Manager: క్యాంటీన్ మేనేజర్‌కు రూ.20 లక్షల జీతం.. ట్విస్ట్ ఏంటంటే..

ABN , Publish Date - Jun 09 , 2025 | 11:30 AM

Canteen Manager: ఒక వేళ క్యాంటీన్ మేనేజర్‌గా సెలెక్ట్ అయితే.. క్యాంటీన్‌లో తయారు అయ్యే భోజనం శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. కాంట్రాక్టర్లను కంట్రోల్ చేయాలి. దగ్గరుండి మరీ వంట చేయించాలి.

Canteen Manager: క్యాంటీన్ మేనేజర్‌కు రూ.20 లక్షల జీతం.. ట్విస్ట్ ఏంటంటే..
Canteen Manager

చైనా వాళ్లు ఏం చేసినా.. వింతగా, విచిత్రంగా ఉంటుంది. వాళ్లు తీసుకునే కొన్ని నిర్ణయాలు అతి తెలివికి నిదర్శనంగా నిలుస్తూ ఉంటాయి. ఇందుకు తాజా సంఘటనే ఓ ప్రత్యక్ష ఉదాహరణగా మారింది. చైనాలోని ఓ ప్రముఖ యూనివర్శిటీ క్యాంటీన్ మేనేజర్ ఉద్యోగం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ జాబ్‌కు సెలెక్ట్ అయిన వారికి సంవత్సరానికి ఏకంగా 20 లక్షల రూపాయలు జీతం ఇస్తుందట. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆ ఉద్యోగం కోసం అప్లై చేసే వారు పీహెచ్‌డీ చదివి ఉండాలట.


పీహెచ్‌డీతో పాటు మతిపోగొట్టే క్వాలిఫికేషన్స్ లిస్ట్ ఒకటి బయటపెట్టింది. అవన్నీ ఉంటేనే జాబ్‌లోకి తీసుకుంటామని అంటోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. చైనా, నన్‌జింగ్ ప్రాంతంలోని సౌత్ఈస్ట్ యూనివర్శిటీ తాజాగా క్యాంటీన్ మేనేజర్ ఉద్యోగం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. సంవత్సరానికి 20 లక్షలు ఇస్తామని, ఉద్యోగం కోసం అప్లై చేసే వాళ్లు పీహెచ్‌డీ చేసి ఉండాలని స్పష్టం చేసింది. అప్లై చేసే వ్యక్తి పీహెచ్‌డీ చేసి ఉండటంతో పాటు ఇంగ్లీస్ అనర్గలంగా మాట్లాడాలట.


ఎమ్ఎస్ ఆఫీస్ తెలిసి ఉండాలట. ఫుడ్, న్యూట్రిషన్‌లో డిగ్రీ చేసి ఉండాలట. కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యత్వం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని కూడా చెప్పింది. ఒక వేళ క్యాంటీన్ మేనేజర్‌గా సెలెక్ట్ అయితే.. క్యాంటీన్‌లో తయారు అయ్యే భోజనం శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. కాంట్రాక్టర్లను కంట్రోల్ చేయాలి. దగ్గరుండి మరీ వంట చేయించాలి. ఇతర క్యాంటీన్ పనులను కూడా దగ్గరుండి మరీ చూసుకోవాలి. ఇన్ని పనులు ఉన్నాయి కాబట్టే.. సంవత్సరానికి 1,80,000 యాన్లు(20 లక్షలు) ఇస్తామని యూనివర్శిటీ అంటోంది.


ఇవి కూడా చదవండి

ఘోర ప్రమాదం.. రైలు నుంచి పడి ఐదుగురు మృతి

హనీమూన్‌లో జంట మిస్సింగ్.. ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదు..

Updated Date - Jun 09 , 2025 | 12:01 PM