Share News

Brazil-Akash Missile: ఆకాశ్ మిసైల్ కొనుగోలుకు బ్రెజిల్ ఆసక్తి

ABN , Publish Date - Jul 03 , 2025 | 05:37 PM

ఆపరేషన్ సిందూర్ సందర్భంగా సత్తా చాటిన ఆకాశ్ మిసైల్ కొనుగోలుకు బ్రెజిల్ ఆసక్తి ప్రదర్శిస్తున్నట్టు విదేశాంగ శాఖ సెక్రెటరీ (ఈస్ట్) తాజాగా తెలిపారు. బ్రెజిల్‌తో కలిసి ఎయిరో స్పేస్ రంగంలో ఓ జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉందని అన్నారు.

Brazil-Akash Missile: ఆకాశ్ మిసైల్ కొనుగోలుకు బ్రెజిల్ ఆసక్తి
Akash Missile

ఇంటర్నెట్ డెస్క్: ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాక్‌కు చుక్కలు చూపించిన ఆకాశ్ మిసైల్‌ కొనుగోలుకు బ్రెజిల్ ఆసక్తి చూపిస్తోంది. ఆకాశ్ మిసైల్‌తో పాటు స్కార్పీన్ క్లాస్ సబ్‌మెరీన్ మెయింటెనెన్స్‌, భారత్‌లో తయారైన కమ్యూనికేషన్ వ్యవస్థలపై బ్రెజిల్ ఆసక్తి ప్రదర్శించినట్టు విదేశాంగ శాఖ సెక్రెటరీ (ఈస్ట్) పి.కుమారన్ వెల్లడించారు. ‘భారత్ రూపొందిస్తున్న పటిష్ఠమైన కమ్యూనికేషన్ వ్యవస్థలు, ఆఫ్‌షోర్ ప్యాట్రోల్ నావలు, స్కార్పీన్ క్లాస్ సబ్‌మెరైన్‌ల నిర్వహణ, ఆకాశ్ గగనతల రక్షణ వ్యవస్థ, తీరప్రాంత నిఘా వ్యవస్థ, గరుడా ఆర్టిలరీ గన్స్‌పై బ్రెజిల్ ఆసక్తి ప్రదర్శిస్తోంది’ అని ఆయన పేర్కొన్నారు. ఎయిరో స్పేస్ రంగంలో ఇరు దేశాల జాయింట్ వెంచర్ ఉండే అవకాశం ఉందని కూడా అన్నారు (Brazil-Akash Missile).


జులై 5 నుంచి 8 తేదీల మధ్య రియోలో బ్రిక్స్ 17వ శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ బుధవారం వెళ్లారు. ఇందులో భాగంగానే ప్రధాని ఘానా, ట్రినిడాడ్, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాల్లో పర్యటించనున్నారు. గ్లోబల్ సౌత్ దేశాలతో దౌత్య బంధాల బలోపేతమే లక్ష్యంగా ఈ పర్యటనలు చేపడుతున్నట్టు ప్రధాని పేర్కొన్నారు. ఇక రక్షణ రంగ సహకారమే ప్రధాన ఎజెండాగా బ్రెజిల్ పర్యటన సాగుతుందని విదేశాంగ శాఖ సెక్రెటరీ (ఈస్ట్) పేర్కొన్నారు.


ఆకాశ్ మిసైల్‌ను భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పాక్‌‌కు భారత్ ఆకాశ్ మిసైల్‌తో గట్టిగా బుద్ధి చెప్పింది. పాక్ డ్రోన్లు, మిసైళ్లను బహుళ అంచెల గగనతల రక్షణ వ్యవస్థతో సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ క్రమంలో ఆకాశ్ వ్యవస్థ పాక్ దాడులను 100 శాతం కచ్చితత్వంతో తిప్పికొట్టిింది. మధ్యశ్రేణి మిసైల్ అయిన ఆకాశ్ 25 కిలోమీటర్ల పరిధిలోని యుద్ధ విమానాలు, డ్రోన్‌లను సులువుగా ధ్వంసం చేయగలదు. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పాక్ క్రూయిజ్ మిసైళ్లను కూడా దీటుగా అడ్డుకుంది. భారత కీలక నిర్మాణాలకు రక్షణగా నిలిచింది.

ఇవి కూడా చదవండి:

ఎఫ్-35 జెట్‌ను స్వదేశానికి తరలించనున్న బ్రిటన్.. చిన్న భాగాలుగా విడగొట్టి..

అగ్ని-5 బంకర్ బస్టర్ మిసైల్ అభివృద్ధికి నడుం కట్టిన డీఆర్‌డీఓ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 03 , 2025 | 06:04 PM