Mosque Blast: నిన్న రైలు హైజాక్.. నేడు మసీదులో పేలుడు
ABN , Publish Date - Mar 14 , 2025 | 05:14 PM
ఖైబెర్ ఫఖ్త్వుంక్వా ప్రావిన్స్‌లోని సౌత్ వజరిస్థాన్ మసీదులో శుక్రవారం ప్రార్థనల సందర్భంగా మధ్యాహ్నం 1.45 గంటలకు పేలుడు చోటుచేసుకుంది. ఈ పేలుడులో చిన్నపిల్లలతో సహా నలుగురు గాయపడ్డారు.

ఇస్లామాబాద్: బలోచిస్థాన్‌లో బీఎల్ఏ ఉగ్రవాదులు రైలు హైజాక్ చేసి పదుల సంఖ్యలో ప్రయాణికులను ఊచకోత కోసిన ఘటన ఇంకా సద్దుమణగక ముందే పాకిస్థాన్‌లో రంజాన్ పండుగ వేళ మరో దుశ్చర్య చోటుచేసుకుంది. ఖైబెర్ ఫఖ్త్వుంక్వా ప్రావిన్స్‌లోని సౌత్ వజరిస్థాన్ మసీదులో శుక్రవారం ప్రార్థనల సందర్భంగా మధ్యాహ్నం 1.45 గంటలకు పేలుడు చోటుచేసుకుంది. ఈ పేలుడులో చిన్నపిల్లలతో సహా నలుగురు గాయపడ్డారు.
Pak Train Hijack Taliban: పాక్ రైలు హైజాకింగ్.. తాలిబాన్ల కీలక ప్రకటన
రాజకీయ పార్టీ జమాయిత్ ఉలేమా ఇస్లామ్ (JUI) నేత అబ్దుల్లా నదీమ్‌ను టార్గెట్‌గా చేసుకుని ఈ పేలుడుకు అగంతకులు పాల్పడినట్టు అధికారులు చెబుతున్నారు. పేలుడు ఘటనలో అబ్దుల్లా నదీప్ తీవ్రంగా గాయపడటంతో అతన్ని, ఇతర క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. కాగా, ఈ ఘటనకు తామే బాధ్యులమని ఇంతవరకూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు.
గత నెలలో నౌషెరా జిల్లాలోని దారుల్ ఉలూమ్ హఖ్కాని సెమినరీ జరుగుతుండగా ఆత్మహుతి దాడి జరిగింది. ఈ దాడిలో జేయూఐ-ఎస్ నేత మౌలానా హమిదుల్ హఖ్ హుఖ్కాని సహా ఆరుగురు మరణించగా, 15 మంది గాయపడ్డారు. దీనికి ముందు 2023 జనవరి 30న పెషావర్ పోలీస్ లైన్స్ ఏరియాలో జరిగిన బాంబు పేలుడులో 59 మంది మృతి చెందగా, 157 మంది గాయపడ్డారు.
ఇవి కూడా చదవండి..
Trump on Putin Remarks: ఆ ప్రకటన హర్షనీయమే కానీ.. పుతిన్ ప్రకటనపై ట్రంప్ రియాక్షన్
Putin - Modi ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణపై పుతిన్ కీలక వ్యాఖ్యలు.. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు
Read Latest and International News