Elon Musk partner: నా కుమారుడి పేరులో శేఖర్ అందుకే.. ఆసక్తికర విషయం బయటపెట్టిన ఎలన్ మస్క్..
ABN , Publish Date - Dec 01 , 2025 | 07:21 PM
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలన్ మస్క్ తన కుటుంబం గురించి ఆసక్తికర విషయాలను తాజా పాడ్‌కాస్ట్‌లో బయటపెట్టారు. జిరోదా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ పాడ్‌కాస్ట్‌లో ఎలన్ మస్క్ మాట్లాడారు. తన వ్యక్తిగత జీవితం గురించి, తన సహజీవన భాగస్వామి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలన్ మస్క్ తన కుటుంబం గురించి ఆసక్తికర విషయాలను తాజా పాడ్‌కాస్ట్‌లో బయటపెట్టారు. జిరోదా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ పాడ్‌కాస్ట్‌లో ఎలన్ మస్క్ మాట్లాడారు. తన వ్యక్తిగత జీవితం గురించి, తన సహజీవన భాగస్వామి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన భార్య శివోన్ జిలిస్ (Shivon Zilis)కు భారతీయ మూలాలు ఉన్నాయని తెలిపారు.
'నా భార్య శివోన్ జిలిస్‌కు భారతీయ మూలాలు ఉన్నాయి (Elon Musk partner). ఆమెను చిన్న వయసులోనే దత్తతకు ఇచ్చారు. ఆమె కెనడాలో పెరిగింది. భారతీయ-అమెరికన్ శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ అంటే నాకు చాలా గౌరవం. ఆయన గౌరవార్థం నా కుమారుడి పేరులో శేఖర్ అనే పదం చేర్చాను' అని ఎలన్ మస్క్ తెలిపారు. యేల్ యూనివర్సిటీలో చదువుకున్న శివోన్ జిలిస్ 2017లో మస్క్ ఆధ్వర్యంలోని న్యూరాలింక్ ప్రాజెక్ట్‌లో చేరారు. ఆ సమయంలో మస్క్, శివోన్ దగ్గరయ్యారు. సహజీవనం ప్రారంభించారు. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు (Shivon Zilis Indian origin).
కాగా, అమెరికా వలస విధానం, ట్రంప్ కఠిన నిర్ణయాల గురించి కూడా మస్క్ తన అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేశారు (Elon Musk family). అపార ప్రతిభ గల భారతీయులను ఉద్యోగులుగా నియమించుకుని అమెరికా చాలా ప్రయోజనాలు పొందిందని మస్క్ అభిప్రాయపడ్డారు. వలసలు, హెచ్1బీ వీసాల విషయంలో ట్రంప్ కఠిన చర్యలు తీసుకుంటున్న ప్రస్తుత తరుణంలో మస్క్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఇవీ చదవండి:
నా పార్టనర్ భారత మూలాలున్న వ్యక్తి, నా కొడుకు పేరు శేఖర్: ఎలాన్ మస్క్
అదే నేను చేసిన అతి పెద్ద పొరపాటు.. హెచ్-1బీ వీసాదారుడి కామెంట్