జర్మనీలో విమానాశ్రయ ఉద్యోగుల ఒకరోజు సమ్మె.. నిలిచిపోయిన వేలాది విమానాలు
ABN , Publish Date - Mar 11 , 2025 | 05:44 AM
వేతనాలు పెంచాలని, భద్రతా సిబ్బంది కాంట్రాక్టు నిబంధనలు మార్చాలని డిమాండు చేస్తూ జర్మనీలో విమానాశ్రయాల ఉద్యోగులు సోమవారం ఒక రోజు సమ్మె చేశారు.

బెర్లిన్, మార్చి 10: వేతనాలు పెంచాలని, భద్రతా సిబ్బంది కాంట్రాక్టు నిబంధనలు మార్చాలని డిమాండు చేస్తూ జర్మనీలో విమానాశ్రయాల ఉద్యోగులు సోమవారం ఒక రోజు సమ్మె చేశారు. చిన్న, పెద్ద అన్ని విమానాశ్రయాల సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. అర్ధరాత్రి నుంచే ‘24 గంటల వాకౌట్’ను అమలు చేశారు. దీంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దేశవ్యాప్తంగా వేలాది విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఒక్క ఫ్రాంక్‌ఫర్ట్ విమానాశ్రయంలోనే రోజుకు 1,116 టేకా్‌ఫలు, ల్యాండింగ్‌లు జరగాల్సి ఉండగా వాటిలో 1,054 రద్దయ్యాయి. చాలా చోట్ల విమానాల ల్యాండింగ్‌లు జరిగినా టేకా్‌ఫలు నిలిచిపోయాయి. ఉద్యోగుల జీతాల పెంపుపై శుక్రవారం మళ్లీ చర్చలు జరగనున్నాయి. భద్రతా సిబ్బంది కాంట్రాక్టు నిబంధనలకు సంబంధించి ఈ నెల 26న సంప్రదింపులు జరుగుతాయి.