Balochistan: పాక్‌లో షాక్.. బలూచిస్థాన్‌లో బుల్లెట్లతో చిద్రమైన ఏడు మృతదేహాలు లభ్యం
ABN , Publish Date - Apr 29 , 2025 | 08:51 PM
చోటియార్ ప్రాంతంలో మంగళవారం ఉదయం ఈ మృతదేహాలు కనిపించాయని, పలుచోట్లు బుల్లెట్ గాయాలుండటంతో ఒకే సమయంలో ఈ కాల్పులు జరిగినట్టు అనుమానిస్తున్నామని జిరాయత్ డిప్యూటీ కమిషనర్ జకావుల్లా దుర్రాని తెలిపారు.

కరాచీ: పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో అత్యంత పాశవిక ఘటన చోటుచేసుకుంది. జియారత్ జిల్లాలో బుల్లెట్లతో చిద్రమైన ఏడు మృతదేహాలను కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మృతదేహాలను గుర్తించిన అనంతరం తీవ్ర ఆగ్రహావేశాలతో నిరసలకు దిగారు. జియారత్ హైవేపై బైఠాయించడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది.
Restaurant Fire: రెస్టారెంట్లో భారీ అగ్ని ప్రమాదం.. 22 మంది మృతి..
చోటియార్ ప్రాంతంలో మంగళవారం ఉదయం ఈ మృతదేహాలు కనిపించాయని, పలుచోట్లు బుల్లెట్ గాయాలుండటంతో ఒకే సమయంలో ఈ కాల్పులు జరిగినట్టు అనుమానిస్తున్నామని జిరాయత్ డిప్యూటీ కమిషనర్ జకావుల్లా దుర్రాని తెలిపారు. హైవేను దిగ్బంధించిన నిరసనకారులకు శాంతిపజేసి, మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం జిల్లా ప్రధానకార్యాలయ ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు.
బలూచిస్థాన్‌లో బుల్లెట్లతో ఛిద్రమైన గుర్తుతెలియని మృతదేహాలు కనిపించడం సాధారణ విషయమే. కనిపించకుండా పోయిన వ్యక్తులకు సంబంధించిన అనేక కేసులు కోర్టుల్లో ఉన్నాయి. కాగా, పాకిస్థాన్‌లోని ఖైబర్ పక్తుంఖ్వా ప్రావిన్స్ పీస్ కమిటీ కార్యాలయంలో మంగళవారం బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో కమిటీ చీఫ్‌తో పాటు 9 మంది ప్రాణాలు కోల్పోయారు. 2022 నవంబర్‌లో నిషేధిత తెహ్రిక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ)తో కాల్పుల విరమణ ఒప్పందం కుప్పకూలడంతో పాకిస్థాన్‌లోని ఖైబర్ పక్తుంఖ్వా, బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఉగ్రవాద ఘటనలు నిత్యకృత్యంగా మారాయి.
ఇవి కూడా చదవండి..