Share News

World Biryani Day 2025: ఇంట్లోనే రుచికరమైన బిర్యానీ.. త్వరగా ఎలా తయారు చేయాలో తెలుసా?

ABN , Publish Date - Jul 06 , 2025 | 05:39 PM

బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఎవ్వరూ ఉండరు. అయితే, రెస్టారెంట్‌‌లో తినే కంటే ఇంట్లోనే రుచికరమైన బిర్యానీ తయారు చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

World Biryani Day 2025: ఇంట్లోనే రుచికరమైన బిర్యానీ.. త్వరగా ఎలా తయారు చేయాలో తెలుసా?
Biryani

World Biryani Day 2025: ప్రతి సంవత్సరం జులై మొదటి ఆదివారం నాడు ప్రపంచ బిర్యానీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. బిర్యానీ అంటే చాలు చాలా మందికి నోరూరుతుంది. ఎందుకంటే ఇది అంత టేస్టీగా ఉంటుంది మరి. పెళ్లి, పండుగ, ఫ్రెండ్స్‌తో పార్టీ ఏదైనా సరే కచ్చితంగా బిర్యానీ ఉండాల్సిందే. లేదంటే ఏదో వెలితిగా ఉంటుంది. బిర్యానీ అంటే ఇష్టపడని వారెవ్వరూ ఉండరు. ఈ బిర్యానీ కేవలం భారత్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఇష్టమైన వంటకం. అందుకే, ప్రతి సంవత్సరం జులై మొదటి ఆదివారం రోజున వరల్డ్ బిర్యానీ డేను జరుపుకుంటారు.

బిర్యానీ అనే పదం ‘బిరింజ్ లేదా బిరియాన్’ అనే పర్షియన్ పదం నుంచి వచ్చిందని అంటారు. దీనిని ముందుగా మొఘల్ చక్రవర్తలు మన దేశానికి తీసుకొచ్చినట్లుగా చెబుతారు. మొఘలుల కాలంలో తరచూ యుద్ధాలు జరిగే సమయంలో సైనికులకు అధిక పోషకాలు అందించేందుకు ఈ బిర్యానీని ఆహారంగా ఇచ్చేవారని చరిత్ర చెబుతోంది. కాలక్రమేణ ఇది ప్రీతికరమైన వంటకంగా మారిపోయింది. అయితే, రెస్టారెంట్‌‌లో తినే కంటే ఇంట్లోనే రుచికరమైన బిర్యానీని కేవలం 30 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా? అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..


బిర్యానీ తయారీకి కావాల్సిన పదార్ధాలు:

చికెన్ లేదా మటన్ - 1 kg

బాస్మతి బియ్యం - 750 గ్రాములు

పెరుగు - 1 కప్పు

అల్లం-వెల్లుల్లి పేస్ట్ - 2 స్పూన్లు

ఉల్లిపాయలు - 2 (సన్నగా తరగినవి)

టొమాటోలు - 2 (సన్నగా తరగినవి)

కొత్తిమీర - 1/2 కప్పు (సన్నగా తరిగినది)

పుదీనా - 1/4 కప్పు (సన్నగా తరిగినది)

గరం మసాలా - 1 స్పూను

నెయ్యి - 2 స్పూన్లు

నూనె - 3 స్పూన్లు

పచ్చిమిర్చి - 3-4 (సన్నగా కట్ చేసినవి)

బిర్యానీ ఆకు - 2

లవంగాలు - 4-5

దాల్చిన చెక్క - చిన్న ముక్క

ఏలకులు - 3-4

ఉప్పు - రుచికి సరిపడా


తయారీ విధానం:

చికెన్ లేదా మటన్ ముక్కలను శుభ్రంగా కడిగి, పెరుగు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా ఆకులు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోండి. తర్వాత బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి 15-20 నిమిషాలు నానబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నెలో నూనె వేసి కాసేపు వేడి చేయాలి. తర్వాత బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, ఏలకులు వేసి వేయించాలి. ఆపై సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి రంగు వచ్చేవరకు వేయించాలి. తర్వాత టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి, మిగిలిన కొత్తిమీర, పుదీనాని వేసి వేయించాలి. ఆ తర్వాత నానబెట్టిన మాంసాన్ని వేసి బాగా కలిపి 5-7 నిమిషాలు వేయించాలి. తర్వాత తగినంత నీరు (బియ్యం పరిమాణాన్ని బట్టి) పోసి, ఉప్పు వేసి, బాగా కలిపి మూతపెట్టి, మాంసం ఉడికే వరకు ఉడికించాలి. ఇలా బిర్యానీని టెస్టీగా తయారు చేసుకోవచ్చు. హోటల్, రెస్టారెంట్‌లో బిర్యానీ కోసం ఎక్కువ డబ్బులు కట్టి ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకునే కంటే ఇంట్లోనే ఇలా బిర్యానీ చేసుకోని తింటే ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాకుండా డబ్బులు కూడా సేవ్ అవుతాయి.


Also Read:

ఈ జంతువు పాలు చాలా డేంజర్.. ఎందుకంటే..

ఇవి తింటే బ్లడ్ షుగర్ లెవల్స్ అమాంతం పెరిగిపోతాయి.. జాగ్రత్త..

For More Health News

Updated Date - Jul 06 , 2025 | 08:51 PM