Share News

Double Carb Danger: మర్మం పిండిపదార్థాల్లోనే

ABN , Publish Date - Apr 22 , 2025 | 01:07 AM

ఒకే భోజనంలో రెండు రకాల పిండిపదార్థాలు తినడం వల్ల బరువు తగ్గకపోవచ్చు. డబుల్‌ కార్బింగ్‌ వల్ల చక్కెర స్థాయిలు పెరిగి, కొవ్వు పేరుకుపోతుంది.

Double Carb Danger: మర్మం పిండిపదార్థాల్లోనే

ద్వంద్వ పిండిపదార్థాలు

ఎంత వ్యాయామం చేసినా, ఎన్ని ఆహార నియమాలు పాటించినా బరువు తగ్గడం లేదంటే అసలు సమస్య మనం తీసుకునే పిండిపదార్థాల్లోనే దాగి ఉంటుంది. అదెలాగంటే...

క్కువ సందర్భాల్లో మనం రెండు రకాల పిండిపదార్థాలను కలిపి తింటూ ఉంటాం! దీన్నే డబుల్‌ కార్బింగ్‌ అంటున్నారు ఫిటెలోలో డైట్‌ కంపెనీలో పని చేస్తున్న ప్రముఖ డైటీషియన్‌ ఉమంగ్‌ మల్హోత్రా. అన్నం, బంగాళాదుంపల కూర, చపాతీ, పులావ్‌, పప్పు లేదా పాస్తా, బ్రెడ్‌... ఇలా ఒకే భోజనంలో రెండు రకాల పిండి పదార్థాలను కలిపి తినడం వల్ల భోజనంలోని పిండిపదార్థాల మోతాదు పెరిగిపోతుందనీ, దాంతో పాటే పోషకాల సంతులనం లేని క్యాలరీలు శరీరానికి తోడవుతూ ఉంటాయనీ అంటున్నారాయన. ఈ అదనపు పిండిపదార్థాల వల్ల రక్తంలో చక్కెర మోతాదులు త్వరితంగా పెరిగి, వాటితో పాటు ఇన్సులిన్‌ మోతాదులు పెరిగి, కొవ్వు పేరుకుపోతుందని హెచ్చరిస్తున్నారు.


అత్యధిక పిండిపదార్థాలతో కూడిన ఆహారం తినడం ద్వారా శరీరంలో పెరిగే ఇన్సులిన్‌, పేరుకున్న కొవ్వును శరీరం కరిగించుకునే సామర్థ్యాన్ని కుంటుపరుస్తుందనీ, దాంతో బరువు తగ్గడం మరింత కష్టమవుతుందనీ హెచ్చరిస్తున్నారాయన. కాబట్టి ఒకే భోజనంలో రెండు పిండిపదార్థాలను ఎంచుకోడానికి బదులుగా అత్యధిక పీచు కలిగిన కూరగాయలు, లేదా ప్రొటీన్‌తో పిండిపదార్థాలను జోడించుకోవాలి. ఉదాహరణకు సోయా పులావ్‌ తింటున్నప్పుడు దాంతో పాటు కూరగాయల వేపుడు ఎంచుకోవాలి.


ఇవి కూడా చదవండి:

బాత్‌రూమ్‌లో ఉన్నప్పుడు ఇలా చేస్తే డేంజరే..

ఈ టైమ్‌లో స్వీట్స్ తింటే నో టెన్షన్

కిడ్నీ సమస్యలున్న వాళ్లు టమాటాలు ఎందుకు తినొద్దంటే..

మధ్యాహ్నం నిద్రతో ఆరోగ్యానికి చేటు కలుగుతుందా?

Read Latest and Health News

Updated Date - Apr 22 , 2025 | 01:21 AM