Share News

Eye Health: వయసు పెరిగినా కంటి చూపు తగ్గకుండా ఉండాలా.. ఈ చిట్కాలు పాటించండి

ABN , Publish Date - Jun 11 , 2025 | 09:29 AM

వృద్ధాప్యం వచ్చినా కొన్ని చిట్కాలతో కంటి చూపును కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. వయసు పెరిగినా కంటి చూపు తగ్గకుండా ఉండాలంటే ఏ చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Eye Health: వయసు పెరిగినా కంటి చూపు తగ్గకుండా ఉండాలా.. ఈ చిట్కాలు పాటించండి
Eye Health

Eye Health Tips: వయసు పెరిగే కొద్దీ మన కంటి చూపు మందగిస్తుంటుంది. ముఖ్యంగా సమీప వస్తువులు స్పష్టంగా కనపడకపోవడం, కంటి శుక్లం , రెటీనా మధ్య భాగం దెబ్బతినడం వంటివి సాధారణంగా వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు. ఇంకా మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులు కూడా కంటి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అయితే, కొన్ని అలవాట్లు పాటిస్తే వృద్ధాప్యం వచ్చినా కంటి చూపును కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


పోషకాల ఆహారం

విటమిన్ A, C, E, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, అలాగే పోషకాలు ఉన్న ఆహారాలు కంటికి చాలా ఉపయోగపడతాయి. ఈ పోషకాలు ఆక్సిడేషన్‌ (శరీరంలో హాని కలిగించే ప్రాసెస్)ను తగ్గించి, రెటీనా ఆరోగ్యాన్ని కాపాడతాయి. అందుకే ఆకుకూరలు, చేపలు, క్యారెట్, గింజలు ఎక్కువగా తినడం మంచిది.

నీరు

తగినంత నీరు తాగితే కళ్ళు తేమగా ఉంటాయి. ఇది డ్రై ఐ సిండ్రోమ్ (కళ్ళు ఎండిపోయి అసౌకర్యం కలిగించటం)ను తగ్గిస్తుంది. ఇది వృద్ధాప్యంలో చాలా సాధారణం. కాబట్టి, ఎక్కువగా నీరు తాగుతూ ఆరోగ్యంగా ఉండండి.

స్క్రీన్ ఎక్కువగా చూడకండి

కంప్యూటర్, ఫోన్ స్క్రీన్ ఎక్కువగా చూస్తే కళ్ళు అలసిపోతాయి. అందుకే 20-20-20 నియమం పాటించండి. అంటే ప్రతి 20 నిమిషాలకి 20 అడుగుల దూరంలో ఉన్న దేనినైనా 20 సెకన్ల పాటు చూడండి. ఇది కంటి ఒత్తిడిని తగ్గిస్తుంది.


వ్యాధులను నియంత్రించండి

మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులను నియంత్రించండి. ఈ వ్యాధులు కంటి రక్తనాళాలకు హాని కలిగించి చూపు కోల్పోవడానికి కారణం అవుతాయి. కాబట్టి మీ చక్కెర, రక్తపోటును తరచూ తనిఖీ చేయించుకుని డాక్టర్ చెప్పిన మందులు సరిగా తీసుకోండి.

సరైన వెలుతురు

పుస్తకం చదవడం, పని చేయడం వంటి వాటికి తగినంత వెలుతురు ఉండాలి. తక్కువ వెలుతురులో పని చేస్తే కళ్ళ మీద ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి, వెలుతురు ఉన్న ప్లేస్‌లో పని చేయండి.

వ్యాయామం చేయండి

శరీరం ఆరోగ్యంగా ఉండటం కంటి ఆరోగ్యానికి కూడా మంచిది. అలాగే కంటికి సంబంధించిన కొన్ని ప్రత్యేక వ్యాయామాలు కూడా చేయడం వల్ల కంటి శక్తి మెరుగుపడుతుంది. మొత్తానికి, ఈ అలవాట్లు పాటిస్తే వయసు పెరిగినా మీ కంటి చూపును దెబ్బతీయకుండా రక్షించుకోవచ్చు.


(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)


Also Read:

ఈ 5 హెర్బల్ డ్రింక్స్ తాగడం వల్ల బరువు తగ్గవచ్చు..

పాలు.. పండ్లు కలిపి తింటున్నారా.. ఈ ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి..

For More Health News

Updated Date - Jun 11 , 2025 | 04:10 PM