Share News

Peanut Butter: పీనట్ బట్టర్ తినండి.. బరువు తగ్గండి..

ABN , Publish Date - Mar 18 , 2025 | 07:24 PM

పల్లీలతో తయారు చేసిన పీనట్ బట్టర్ తినటం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి పీనట్ బట్టర్ ఓ మంచి ఎంపిక అవుతుంది.

Peanut Butter: పీనట్ బట్టర్ తినండి.. బరువు తగ్గండి..
Peanut Butter

బరువు తగ్గడం అన్నది కొంతమందికి చిరకాల కల. వారు ఎంత ప్రయత్నించినా కేజి బరువు కూడా తగ్గలేకపోతుంటారు. నెలలు నెలలు జిమ్‌లో గడిపినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుంటుంది. నూటికి 99 శాతం కేసుల్లో సరైన డైట్ లేకపోవటం కారణంగానే బరువు తగ్గలేకపోతుంటారు. చాలా మందికి ఏం తినాలో.. ఏం తినకూడదో కూడా తెలీదు. కొన్ని ఆహార పదార్ధాల విషయంలో అపోహలు ఉంటాయి. ముఖ్యంగా పీనట్ బట్టర్ విషయంలో. పల్లీలతో తయారు చేసిన పీనట్ బట్టర్ తినటం వల్ల బరువు పెరుగుతారని అనుకుంటూ ఉంటారు. పల్లీల్లో ఎక్కువ క్యాలరీలు ఉంటాయని భావించటం వల్ల ఇలా జరుగుతుంది. అయితే, పీనట్ బట్టర్ తింటూ కూడా బరువు తగ్గొచ్చట. ఇది నేను చెప్పటం లేదు. పీనట్ బట్టర్ మీద జరిగిన పరిశోధనలు చెబుతున్నాయి.


పరిశోధనలో ఏం తేలింది?..

2018లో యూరోపియన్ జర్నల్ ఆఫ్ నూట్రిషన్‌లో ఓ స్టడీ పబ్లిష్ అయింది. సైంటిస్టులు 3,75,000 మందిపై పరిశోధనలు చేశారు. వీరిని రెండు భాగాలు విభజించారు. వీరిలో ఓ భాగం తరచుగా పల్లీలు లేదా ఇతర నట్స్ తింటున్నవారు ఉన్నారు. రెండో భాగంలో అసలు పల్లీలు తినని వారు ఉన్నారు. వీరిలో పల్లీలు లేదా ఇతర నట్స్ తింటున్న వారు బరువు తగ్గారు. పల్లీలు, పీనట్ బట్టర్ తింటున్న పిల్లలు సరైన బరువు కలిగి ఉన్నారు. ఆరోగ్యంగా కూడా ఉన్నారు. పీనట్ బట్టర్‌లో ఉన్న ఫైబర్, హెల్తీ ఫ్యాట్స్, ప్రొటీన్ ఆకలిని తగ్గించి.. సంతృప్తిని, జీవక్రియను పెంచాయి. అయితే, కొంతమంది వ్యక్తుల్లో పీనట్ బట్టర్ బరువు తగ్గాలన్న ప్లాన్‌ను చెడగొట్టింది. ఇలా జరగడానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి. అవేంటంటే.. ఉప్పు లేదా చెక్కర కలిపిన బట్టర్ తినటం. మోతాదుకు మించి తినడం. చాక్లెట్ లేదా జెల్లీతో బట్టర్‌ను కలుపుకుని తినటం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది.


పీనట్ బట్టర్‌తో ఎన్నో లాభాలు..

100 గ్రాముల పీనట్ బట్టర్‌లో 588 క్యాలరీలు ఉంటాయి. 21.9 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. 49.5 గ్రాముల ప్రొటీన్లు ఉంటాయి. 24 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. 5.7 డైటరీ ఫైబర్స్ ఉంటాయి. పీనట్ బట్టర్లో మాగ్నీషియం, పొటాషియం, జింక్, నియాసిన్, విటమిన్ బీ6లు ఎక్కువగా ఉంటాయి. పీనట్ బట్టర్ వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. రోగ నిరోదక శక్తి పుంజుకుంటుంది. పీనట్ బట్టర్‌లోని కొవ్వులు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మొత్తానికి మన ఆరోగ్యం పాడవుకుండా భద్రంగా ఉంటుంది. బాడీ బిల్డింగ్ చేస్తున్న వారికి పీనట్ బట్టర్ మంచి ఎంపిక అవుతుంది. ముఖ్యంగా మాంసం తినని వారు తమ డైట్‌లో పీనట్ బట్టర్‌ను చేర్చుకుంటే చాలు. అయితే.. కొంతమందికి పల్లీల అలర్జీ ఉంటుంది. అలాంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. పల్లీల జోలికి ఏమాత్రం వెళ్లకూడదు.


Read Also :
Acidity Remedies: తరచూ అసిడిటీతో బాధపడుతున్నారా.. ఇలా చేస్తే క్షణాల్లో మాయం..

Blood Pressure : బీపీ ఉన్నవాళ్లు తప్పక తినాల్సిన 5 రకాల ఆహారాలు..

Waking Up at 2AM: రాత్రుళ్లు సరిగా నిద్రపట్టట్లేదా.. అర్ధరాత్రి రెండింటికి మెళకవ

Updated Date - Mar 18 , 2025 | 07:24 PM