Outdoor Shoes: ఇంట్లోకి షూ వేసుకెళుతున్నారా.. అయితే, మీ ప్రాణాలు రిస్క్‌లో పడ్డట్టే..
ABN , Publish Date - Apr 18 , 2025 | 11:04 AM
Outdoor Shoes: కొంతమంది బయట వేసుకుని తిరిగే షూలతో ఇంట్లోకి వస్తూ ఉంటారు. వాటితోటే ఇంట్లో అటు, ఇటు తిరుగుతూ ఉంటారు. ఇలా చేయటం వల్ల ప్రాణాలు తీసే బ్యాక్టీరియా, క్యాన్సర్‌కు కారణమయ్యే కెమికల్స్ ఇంట్లోకి చేరే అవకాశం ఉందట.

ఇంట్లో షూ వేసుకుని తిరుగుతూ ఉన్నారా? అయితే మీ ప్రాణాలు.. మీతో పాటు మీ కుటుంబసభ్యుల ప్రాణాలు రిస్కులో పడ్డట్టే. బయట వేసుకుని తిరిగే షూలతో ఇంట్లో తిరగటం వల్ల ప్రాణాలు తీసే బ్యాక్టీరియా, క్యాన్సర్‌కు కారణమయ్యే కెమికల్స్ ఇంట్లోకి చేరే అవకాశం ఉందని మైక్రో బయాలజిస్టు డాక్టర్ మనల్ మహ్మద్ హెచ్చరిస్తున్నారు. ప్రమాదకరమైన ఈ కోలీ అనే బ్యాక్టీరియా కారణంగా కిడ్నీ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. నాలుగు జతల్లో.. ఒక జతపై ఈ ప్రమాదకరమైన ఈ కోలీ బ్యాక్టీరియా ఉన్నట్లు ఆయన తెలిపారు. రోడ్లపై వేసుకు తిరిగే షూల కారణంగా పలు రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం కూడా ఉందని అన్నారు.
వాటిని ఇంట్లోకి వేసుకుని వస్తే.. ఇంట్లోకి క్యాన్సర్లను ఆహ్వానించినట్లేనని పేర్కొన్నారు. మురికిపట్టిన షూలను ఇంట్లోకి వేసుకెళ్లడం వల్ల బయటి కంటే.. 37 రెట్లు ఎక్కువగా క్యాన్సర్ కారకాలు చేరే అవకాశం ఉందన్నారు. ఇంట్లోకి వెళ్లే ముందే షూలను గుమ్మం దగ్గర వదలటం వల్ల ప్రమాదకరమైన బ్యాక్టీరియా, కెమికల్స్ నుంచి రక్షణ పొందొచ్చని అన్నారు. పాద రక్షల్ని ఇంట్లోకి వేసుకెళ్లటం వల్ల లేని పోని జబ్బుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుదన్నారు. మరీ ముఖ్యంగా నేలపై దోగాడే పసి పిల్లలకు పెద్ద ఎత్తున ప్రమాదం జరిగే అవకాశం ఉందని తెలిపారు. ఇక, ఈ కోలి అనే బ్యాక్టీరియా మనుషులు, జంతువుల మలాల్లో ఉంటుంది.
ఇది కొన్ని సార్లు రక్త విరేచనాలు అయ్యేలా చేస్తుంది. అంతేకాదు..ఈ కోలి వల్ల కిడ్నీలు పాడయ్యే అవకాశం కూడా ఉంది. గత సంవత్సరం ఈ కోలి బ్యాక్టీరియా కారణంగా ఓ సూపర్ మార్కెట్‌లోని సాండ్ విచ్‌లు కలుషితం అయ్యాయి. దీని కారణంగా 300 మంది అనారోగ్యం పాలయ్యారు. 100 మంది ఆస్పత్రి పాలయ్యారు. ఓ ఇద్దరు చనిపోయారు. అయితే, 2019లో జరిగిన పరిశోధనల్లో షూలను ఇంట్లో వేసుకుని తిరగటం వల్ల నేలపై దోగాడే పిల్లలకు ఆస్తమా వచ్చే అవకాశం తక్కువగా ఉందని తేలింది. బయట తిరిగే షూలను ఇంట్లోకి వేసుకెళ్లటం వల్ల 10 శాతం లాభాలు ఉంటే.. 90 శాతం నష్టాలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి
విమానం హైజాక్ చేయాలనుకున్నాడు.. తోటి ప్రయాణికుడి చేతిలో చచ్చాడు..
Gold Articles: వెయ్యి కేజీల బంగారాన్ని కరిగించిన గుళ్లు.. ఎందుకంటే..