Share News

Milk: పాలను ఇలా మరిగిస్తే.. ఆరోగ్యానికి ముప్పు తప్పదు..

ABN , Publish Date - Jun 10 , 2025 | 12:26 PM

పాలు ఆరోగ్యానికి మంచివి. వీటిని ఎక్కువుగా మరిగించి తాగుతారు. అయితే, పొరపాటున కూడా ఈ లోహపు పాత్రలలో పాలు మరిగించడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పాలు విషపూరితంగా మారే అవకాశం ఉందని అంటున్నారు.

Milk: పాలను ఇలా మరిగిస్తే.. ఆరోగ్యానికి ముప్పు తప్పదు..
Milk

నేటి కాలంలో ప్రజలు తమ ఇళ్లలో రాగి, ఇత్తడి వంటి అనేక రకాల లోహ పాత్రలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే, పొరపాటున కూడా ఈ పాత్రలలో పాలు మరిగించడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పాలు విషపూరితంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. పాలను ఏ పాత్రలలో మరిగించడం ప్రమాదకరమో, ఏ పాత్రలలో మరిగించడం సురక్షితమో ఇప్పుడు తెలుసుకుందాం..


రాగి పాత్రలు

రాగి పాత్రలో నిల్వ చేసిన నీరు తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కానీ పాలు లేదా పాల ఉత్పత్తులను పొరపాటున కూడా రాగి పాత్రలో ఉడికించకూడదు లేదా నిల్వ చేయకూడదు. పాలను రాగిలో వేడి చేసిన వెంటనే, అది పాలలో కరగడం ప్రారంభమవుతుంది. దీనివల్ల పాలు విషపూరితంగా మారుతాయి.

ఇత్తడి పాత్రలు

ఇత్తడి పాత్రలు చాలా మందికి సంప్రదాయంగా ఇష్టమైనవే. కానీ ఇందులో లోపలి పొర (టిన్‌ లైనింగ్) లేకపోతే, దాని లోహం నేరుగా పాలతో రియాక్ట్ అవుతుంది. దీని వల్ల పాలు త్వరగా పాడవుతాయి. ఆరోగ్యానికి హానికరంగా మారుతాయి.

అల్యూమినియం పాత్రలు

అల్యూమినియం పాత్రలు రోజువారీ వంటలో ఎక్కువగా వాడతారు. కానీ ఇందులో ఎక్కువసేపు పాలు మరిగిస్తే అల్యూమినియం పాలలోకి చేరి అది తినేవారికి నెమ్మదిగా నష్టాన్ని కలిగిస్తుంది. ఇది అల్జీమర్స్ వంటి మెదడు సంబంధిత సమస్యలకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

నాణ్యత లేని స్టీల్ పాత్రలు

చౌకగా దొరికే స్టీల్ పాత్రలు ఫుడ్ గ్రేడ్ కాకపోతే అందులో ఉండే లోహాలు వేడికి లొంగి పాలలోకి కలిసే ప్రమాదం ఉంది. దీని వల్ల పాలు విషపూరితంగా మారుతాయి.


గాజు పాత్రలు

గాజు రసాయనాలతో రియాక్ట్ కావు. అందుకే గాజు పాత్రలలో పాలను ఉడికించడం పూర్తిగా సురక్షితం. కానీ గాజు పగిలే అవకాశం ఎక్కువగా ఉండటం వల్ల జాగ్రత్తగా వాడాలి.

స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలు

అధిక నాణ్యత గల స్టెయిన్‌లెస్ స్టీల్ పాలను మరిగించడానికి చాలా సురక్షితమైనది. ఇది మానవ ఆరోగ్యానికి హాని కలిగించదు, వాడటానికి కూడా సులభంగా ఉంటుంది.

Updated Date - Jun 10 , 2025 | 12:42 PM