Share News

Intermittent fasting: ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌ నిజంగా ఫలితమిస్తుందా? కొత్త రీసెర్చ్ ఏం చెబుతోందంటే..

ABN , Publish Date - Jun 21 , 2025 | 11:22 AM

అధిక బరువు, ఊబకాయం సమస్యలు నేడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని వేధిస్తున్నాయి. ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. దీంతో బరువు తగ్గడానికి ప్రజలు అనేక రకాల పద్ధతులను అవలంబిస్తున్నారు. అందులో ఒకటి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్.

Intermittent fasting: ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌ నిజంగా ఫలితమిస్తుందా? కొత్త రీసెర్చ్ ఏం చెబుతోందంటే..
New research reveals shocking secrets about intermittent fasting

అధిక బరువు (Over Weight), ఊబకాయం (Obesity) సమస్యలు నేడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని వేధిస్తున్నాయి. ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. దీంతో బరువు తగ్గడానికి ప్రజలు అనేక రకాల పద్ధతులను అవలంబిస్తున్నారు. అందులో ఒకటి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ (Intermittent fasting). అంటే రోజులో కొన్ని గంటల పాటు ఏమీ తినకుండా ఉండడం. ఈ రకమైన ఫాస్టింగ్ చాలా మంచి ప్రభావం చూపిస్తోందని పలువురు డాక్టర్లు కూడా అంగీకరిస్తున్నారు.


తాజాగా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌పై ఓ ఆసక్తికర అధ్యయనం జరిగింది. ఆ అధ్యయనంలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. బ్రిటిష్ మెడికల్ జర్నల్‌లో ఆ అధ్యయనం ప్రచురితమైంది. ఈ అధ్యయనం కోసం 6,500 మందిని పరీక్షించారు. వీరందరి బీఎమ్‌ఐ 31 కంటే ఎక్కువగా ఉంది. వీరి చేత ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయించి 52 వారాల పాటు వారిని పరిశీలించారు. వీరిపై జరిపిన పరీక్షల అనంతరం ప్రత్యామ్నయ రోజుల ఉపవాసం అత్యంత ప్రభావవంతంగా పని చేస్తోందని తేలింది. అంటే ఒకరోజు తినడం, తర్వాతి రోజు ఉపవాసం ఉండడం.


ఇలా రోజు తప్పించి రోజు మాత్రమే తిన్న వారు గణనీయంగా బరువు తగ్గినట్టు ఈ అధ్యయనం రుజువు చేసింది. వారు నెలకు సగటను రెండు కేజీల వరకు ఆరోగ్యకరంగా బరువు తగ్గారట. బరువు తగ్గడం మాత్రమే కాదు.. చెడు కొలెస్ట్రాల్ (LDL)ను తగ్గించడంలో కూడా ఈ ప్రత్యామ్నయ రోజుల ఉపవాసం అత్యంత ప్రభావవంతంగా పని చేస్తోందని తేలింది. అయితే ఈ రకమైన ఫాస్టింగ్‌పై మరింత అధ్యయనం చేయాల్సి ఉందని, అప్పుడే పూర్తి సమాచారం వెలుగులోకి వస్తుందని అధ్యయనకారులు చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి:

శరీరంలో టెంపరేచర్‌కు ఓ లిమిట్.. ఈ లక్ష్మణ రేఖ దాటితే..

మంచి కొలెస్టరాల్, చెడు కొలెస్టెరాల్ మధ్య తేడా ఇదే

Read Latest and Health News

Updated Date - Jun 21 , 2025 | 11:22 AM