Share News

Original Vs Fake Paneer: సింపుల్ చిట్కాతో ఒరిజినల్ పన్నీర్‌ను తెలుసుకోండిలా

ABN , Publish Date - May 05 , 2025 | 02:55 PM

Original Vs Fake Paneer: పన్నీర్‌ను రుచి, వాసన, ఆకృతిని బట్టి కూడా అది సహజమైనదా కాదా తెలుసుకోవచ్చు. నిజమైన పన్నీర్ మృదువుగా పాల రుచిని కలిగి ఉంటుంది. నకిలీ పన్నీర్ రబ్బరు మాదిరిగా, చాలా నమిలేలా ఉంటుంది.

Original Vs Fake Paneer: సింపుల్ చిట్కాతో ఒరిజినల్ పన్నీర్‌ను తెలుసుకోండిలా
Original Vs Fake Paneer

పన్నీర్‌తో చేసిన ఏ ఆహార పదార్థాన్నైనా చాలా మంది ఇష్టం తింటుంటారు. పన్నీర్ మషాలా, పన్నీర్ బిర్యానీ, పాలక్ పన్నీర్ ఇలా పన్నీర్‌తో చాలా రకాల వంటకాలను చేస్తుంటారు. ప్రొటీన్ ఎక్కువగా పన్నీర్‌ను తరచూ ఆహారంలో భాగంగా చేసుకుంటారు. కానీ పన్నీర్‌ను కూడా కల్తీ చేసేస్తున్నారనే వార్త అందరినీ కలిచివేస్తోంది. పన్నీర్‌ను కొనే ముందు అది ఒరిజనలా.. నకిలీదా అని తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లలో నకిలీ పదార్థాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏది కొనాలన్నా కూడా భయపడే పరిస్థితులు ఉన్నాయి. నకిలీ ఆహార పదార్థాలతో వినియోగదారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు వ్యాపారస్థులు. పన్నీర్‌ను కూడా నకిలీగా తయారు చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. అయితే కొన్ని చిట్కాలతో మనం తీసుకున్న పన్నీర్ సహజమైనదా కాదా అని నిర్ధారించుకోవచ్చు.


సాధారణంగా కల్తీ పన్నీర్‌ను కూరగాయల కొవ్వులు, నూనెలు, పాలపొడి వంటి ప్రత్యామ్నాయ ప్రోటీన్ వనరులతో తయారు చేస్తారు. కొన్ని పరీక్షల ద్వారా నకిలీ పన్నీర్‌ను గుర్తించవచ్చు. పన్నీర్‌ను రుచి, వాసన, ఆకృతిని బట్టి కూడా అది సహజమైనదా కాదా తెలుసుకోవచ్చు. నిజమైన పన్నీర్ మృదువుగా పాల రుచిని కలిగి ఉంటుంది. నకిలీ పన్నీర్ రబ్బరు మాదిరిగా, చాలా నమిలేలా ఉంటుంది. నకిలీ పన్నీర్‌ను తయారు చేయడం , అమ్మడం చట్టవిరుద్ధం. అలాగే నిజమైన పన్నీర్ అంటూ లేబుల్ వేయడం కూడా నేరమనే చెప్పుకోవాలి.

AP Liquor Scam Latest Update: లిక్కర్ స్కాం.. జగన్‌ బ్యాచ్‌కు సుప్రీంలో ఎదురుదెబ్బ


మరో పద్దతిలో కూడా నకిలీ పన్నీర్‌ను గుర్తించవచ్చు. ఆహార ఉత్పత్తులలో పిండి పదార్థాన్ని గుర్తించేందుకు ఆయోడిన్ పరీక్ష చేస్తుంటారు. అయోడిన్ ద్రవాణాన్ని పన్నీర్‌ మీద వేసినప్పుడు నిజమైన పన్నీర్ లేత గోధుమ రంగులోకి మారుతుంది. నకిలీ పన్నీర్ మాత్రం ముదురు నల్లగా మారుతుంది. మొత్తం పనీర్ క్యూబ్ లేదా పనీర్ టిక్కాను పరీక్షించినప్పుడు స్టార్చ్‌గా కనిపిస్తే అది కల్తీదని అర్థం. ఇలా చేయడం వల్ల కూడా పన్నీర్‌లో కల్తీ లేదని భావించవద్దు. ఎన్నోసార్లు పన్నీర్ నమూనాలను పరీక్షించినప్పటికీ చాలాసార్లు విఫలమయ్యాయి కూడా.


పన్నీర్ నాణ్యతకు కొవ్వు శాతం చాలా ముఖ్యం. అయితే కొన్ని చిట్కాలను సహజమైన పన్నీర్‌ను గుర్తించవచ్చు. ముఖ్యంగా తక్కువ ధరకే పన్నీర్ లభిస్తే మాత్రం దానికి దూరంగా ఉండండి. మీరు పన్నీర్ తీసుకునే షాపులో శుభ్రతను పరిశీలించండి. అలాగే ఎఫ్‌ఎస్‌ఎస్‌ఐ లైసెన్స్‌ ఉందా లేదా చూసుకోవాలి. పన్నీర్ కొనేటప్పుడు దాని వాసనను చూడాలి. పన్నీర్ పుల్లగా వాసన వస్తే అది కల్తీదని అర్థం.


ఇవి కూడా చదవండి

Coconut Water Vs Sugarcane Juice: కొబ్బరి నీళ్లా.. చెరుకు రసమా.. హెల్త్‌కు ఏది బెస్ట్

West Bengal Shocking Incident: షాకింగ్ ఘటన.. భార్య ముక్కు అందంగా ఉందన్నాడు.. చివరకు

Read Latest Health News And Telugu News

Updated Date - May 05 , 2025 | 02:55 PM