Share News

Eye Health: కంటి చూపు బాగుండాలంటే.. ఈ ఫుడ్స్ తినాల్సిందే

ABN , Publish Date - Jun 13 , 2025 | 02:48 PM

Eye Health: పోషక లోపాల కారణంగా కూడా కంటి సమస్యలు వస్తుంటాయి. కొన్ని రకాల ఆహారాల పదార్థాలతో కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కొన్ని పోషకాలతో కూడిన ఆహారాలు తినడం వల్ల అవి కంటికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.

Eye Health: కంటి చూపు బాగుండాలంటే.. ఈ ఫుడ్స్ తినాల్సిందే
Eye Health

ఈ మధ్య కాలంలో కంటి సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. ఒకప్పుడు పెద్ద వారిలోనే కంటి సమస్యలు కనిపించేవి. కానీ ఇప్పుడు చిన్నపిల్లలు కూడా ఆ సమస్యతో ఎక్కువగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ముఖ్యంగా పిల్లలు చాలా సమయం ఫోన్‌ చూడడం కూడా కంటి సమస్యలకు కారణంగా చెప్పవచ్చు. పిల్లలు గంటల తరబడి మొబైల్‌లో గేమ్‌లు ఆడటం, వీడియోలు చూడటం చేస్తుంటారు. ఎక్కువ సేపు స్క్రీన్‌ను చూడటం వల్ల అతి సున్నితమైన కళ్లు ఇబ్బందికి గురవుతాయి. కంటి చూపు బలహీనమవుతుంది. అంతే కాకుండా పెద్దలు ఉద్యోగ రీత్యా గంటల తరబడి కంప్యూటర్‌‌లను చూడటం వల్ల కూడా కంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. సైట్, తలనొప్పుల కారణంగా కళ్ల జోడులు ధరించాల్సి వస్తుంది.


ఇక పోషక లోపాల కారణంగా కూడా కంటి సమస్యలు వస్తుంటాయి. కొన్ని రకాల ఆహారాల పదార్థాలతో కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కొన్ని పోషకాలతో కూడిన ఆహారాలు తినడం వల్ల అవి కంటికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. దీంతో కళ్లజోడును ధరించే బాధ నుంచి తప్పించుకోవచ్చు. ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. క్యారెట్లు, రెడ్ బెల్ పెప్పర్స్, ఆకుపచ్చ కూరగాయలు తినడం వల్ల కంటిని ఆరోగ్యంగా ఉంచవచ్చు. వీటిని తరచూ తీసుకోవడం వల్ల కళ్ళను యూవీ నష్టం నుంచి రక్షించడంతో పాటు కంటిశుక్లం, మాక్యులర్ క్షీణత వంటి వయస్సు సంబంధిత కంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.


క్యారెట్లు

carrot.jpg

క్యారెట్లలో విటమిన్లు ఎ, బీ, సీ,కే పుష్కలం. అలాగే అనేక ఖనిజాలు కూడా క్యారెట్లలో నిండి ఉంటాయి. క్యారెట్లను తరచూ తినడం వల్ల దృష్టి మెరుగుపడటంతో పాటు రెటీనాను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. కంటి సమస్యలు ఉన్నవారు కచ్చితంగా క్యారెట్లను తిని ఆ ప్రాబ్లమ్స్‌ నుంచి ఉపశమనం పొందవచ్చు.


రెడ్ బెల్ పెప్పర్స్

redbell-pepper.jpg

రెడ్ బెల్ పెప్పర్స్‌లో విటమిన్ సీ యాంటీఆక్సిడెంట్లు పుష్కలం. ఇవి కళ్ళను వాపు, ఒత్తిడి నుంచి రక్షిస్తాయి. రెడ్ బెల్ పెప్పర్స్‌లోని విటమిన్ సీ కంటెంట్ కళ్ళలోని రక్త నాళాల ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది.


ఆకుపచ్చ కూరగాయలు

green-vegetables.jpg

ఆకుపచ్చ కూరగాయలు కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడతాయి. వీటిని ప్రతీరోజూ తీసుకోవడం ద్వారా కంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా పాలకూరలో కంటి ఆరోగ్యానికి మేలు చేసే లుటిన్, జియాక్సంతిన్ వంటి పోషకాలు అధిక మొత్తంలో ఉంటాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే కంటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.


ఇవి కూడా చదవండి

తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా అనిపిస్తుందా..ఈ 6 చిట్కాలు ట్రై చేయండి..

ఈ జ్యూస్ తాగితే షుగర్ లెవెల్స్ డౌన్..

Read Latest Health News And Telugu News

Updated Date - Jun 13 , 2025 | 02:58 PM