Weight Loss Drinks: ఈ 5 హెర్బల్ డ్రింక్స్ తాగడం వల్ల బరువు తగ్గవచ్చు..
ABN , Publish Date - Jun 11 , 2025 | 08:28 AM
బరువు తగ్గడానికి చాలా మంది తెగ కష్టపడతారు. కఠినమైన డైటింగ్‌తో పాటు జిమ్‌లో గంటలు తరబడి చెమటలు పట్టేలా వ్యాయామాలు చేస్తారు. అయితే, కేవలం ఈ 5 హెర్బల్ డ్రింక్స్ తాగడం వల్ల బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Weight Loss Drinks: ఈ రోజుల్లో చాలా మంది ఫిట్‌గా ఉండాలని కోరుకుంటున్నారు. అందుకోసం కొంతమంది జిమ్‌కి వెళ్తుంటే, ఇంకొందరు డైటింగ్ చేస్తుంటారు. కానీ ఇంట్లోనే ఉన్న కొన్ని ఆహార పదార్థాలతో తయారయ్యే కొన్ని పానీయాలు కూడా బరువు తగ్గించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. సరైన ఆహారం, వ్యాయామం తోపాటు వీటిని తిసుకుంటే ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, బరువు తగ్గవచ్చని అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
నిమ్మకాయ నీరు
నిమ్మకాయ నీరు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉన్న విటమిన్ C శరీరంలో జీవక్రియను మెరుగుపరుస్తుంది. రోజుకోసారి, ఉదయాన్నే ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగితే బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.
తేనె కలిపిన నిమ్మకాయ నీరు
నిమ్మకాయ నీటిలో తేనె కలిపి తాగితే మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా రాత్రి భోజనం తరువాత తాగితే ఇది జీర్ణక్రియను మెరుగుపరచి, బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.
కొత్తమీర నీరు
కొత్తమీర నీరు ఆకలిని నియంత్రించడంలో, జీర్ణాన్ని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. ఒక కప్పు నీటిని మరిగించి అందులో కొత్తమీర వేసి 10 నిమిషాలు మరిగించాలి. తర్వాత ఫిల్టర్ చేసుకొని తాగవచ్చని నిపుణులు చెబుతున్నారు.
దాల్చిన చెక్క నీరు
దాల్చిన చెక్క శరీరంలో చక్కెర స్థాయిని సమతుల్యంలో ఉంచుతుంది. రాత్రి పడుకునే ముందు ఈ నీటిని తాగితే శరీరంలో మేలైన మార్పులు వస్తాయి. ముఖ్యంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
జీలకర్ర నీరు
జీలకర్ర నీరు శరీరానికి చాలా మంచిది. ఇది టాక్సిన్స్‌ను బయటికి పంపిస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే మంచి ఫలితం ఉంటుంది. బరువు తగ్గడానికీ సహాయపడుతుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
పాలు.. పండ్లు కలిపి తింటున్నారా.. ఈ ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి..
పాలను ఇలా మరిగిస్తే.. ఆరోగ్యానికి ముప్పు తప్పదు..