Diet Soda Diabetes Risk: రోజూ డైట్ సోడా తాగుతున్నారా? 38% పెరుగుతున్న డయాబెటిస్ రిస్క్ .!
ABN , Publish Date - Aug 02 , 2025 | 04:34 PM
చాలా మంది బరువు తగ్గడానికి ప్రతిరోజూ ఒక డైట్ సోడా తాగుతుంటారు. అయితే, రోజుకు ఒక్క డైట్ సోడా తాగడం వల్ల డయాబెటిస్ ప్రమాదం 38% పెరుగుతుందని ఆస్ట్రేలియాలో జరిగిన ఒక కొత్త అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఇంటర్నెట్ డెస్క్: డైట్ సోడాలో సాధారణ సోడాల కంటే తక్కువ కేలరీలు ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి లేదా బరువును నియంత్రించడానికి సహాయపడుతుందని చాలా మంది దీనిని ఎక్కువగా తీసుకుంటారు. అయితే, ఇలా రోజుకు ఒక డైట్ సోడా తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 38% పెరుగుతుందని ఆస్ట్రేలియాలో జరిగిన ఒక కొత్త అధ్యయనం కనుగొంది.
కృత్రిమ స్వీటెనర్లతో చేసిన ఈ శీతల పానీయాల వల్ల వచ్చే ప్రమాదం సాధారణ చక్కెర పానీయాల కంటే ఎక్కువగా ఉందని అధ్యయనం చూపిస్తుంది. ఇవి 23% ఎక్కువ ప్రమాదం పెంచే అవకాశం ఉందని తేలింది. ఆస్ట్రేలియాలోని మూడు ముఖ్యమైన సంస్థలు నిర్వహించిన ఈ అధ్యయనంలో 40-69 సంవత్సరాల వయస్సు గల 36,000 మందిని దాదాపు 14 సంవత్సరాల పాటు పరిశోధన చేశారు. అంటే ఎప్పటికప్పుడు వారి ఆహారం, వ్యాయామం, ఆరోగ్య పరిస్థితులు, జీవనశైలి మార్పులు ఎలా ఉన్నాయో రికార్డ్ చేశారు. ఈ పరిశోధనలో స్వీట్ డ్రింక్స్, కృత్రిమ స్వీటెనర్లతో చేసిన డైట్ డ్రింక్స్ ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపిస్తాయనే విషయం పరిశీలించారు.
ప్రధాన విషయాలు:
డైట్ డ్రింక్స్ మనం అనుకుంటున్నట్టు స్వీట్ డ్రింక్స్‌కు సురక్షితమైన ప్రత్యామ్నాయం కాదని ఈ పరిశోధనలో తేలింది. ప్రతి రోజు ఒకటి లేదా అంతకంటే ఎక్కువగా డైట్ డ్రింక్స్ తాగడం వల్ల, టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. టైప్ 2 డయాబెటిస్ ప్రపంచవ్యాప్తంగా 1.3 మిలియన్ల మంది ఆస్ట్రేలియన్లను, 500 మిలియన్లకు పైగా ప్రజలను ప్రభావితం చేస్తుంది. వీటిలో ఎక్కువ కేసులు ఆహారం, జీవనశైలితో ముడిపడి ఉన్నాయి. కాబట్టి, డైట్ డ్రింక్స్ తాగడం కూడా పూర్తిగా సురక్షితం కాదని ఈ అధ్యయనం స్పష్టం చేస్తుంది.
డైట్ సోడా తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని, వీటిలో టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు, మెటబాలిక్ సిండ్రోమ్, మరికొన్ని ఉన్నాయని తేలింది. డైట్ సోడాలో కృత్రిమ స్వీటెనర్లు ఉంటాయి కాబట్టి ఇవి ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునే వారు కృత్రిమంగా చేసిన ఈ డైట్ సోడా తాగి ఇతర ఆరోగ్య సమస్యలు తెచ్చుకునే కంటే సహాజమైన పానీయాలు తాగడం సురక్షితమని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read:
ఈ వంటమనిషికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు కూడా సాటిరాలేరు.. మహిళా లాయర్ పోస్టు వైరల్
ప్రపంచంలో 13 దేశాల్లో నాస్తికుల మెజారిటీ.!
For More Health News