Diabetes: డయాబెటిస్ కంట్రోల్ చేయాలంటే.. డైట్‌లో వీటిని తీసుకోండి..
ABN , Publish Date - Jun 09 , 2025 | 06:25 PM
డయాబెటిస్ కంట్రోల్ చేయాలంటే మీ డైట్‌లో వీటిని చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల డయాబెటిస్‌ను సహజంగా నియంత్రించవచ్చని సూచిస్తున్నారు.

డయాబెటిస్ అనేది ఒక దీర్ఘకాలిక సమస్య. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగడానికి దారితీస్తుంది. టైప్ 1 డయాబెటిస్ అనేది మీ శరీరం ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేనప్పుడు సంభవిస్తుంది. అయితే, టైప్ 2 డయాబెటిస్ అనేది మీ శరీరం ఇన్సులిన్‌కు సరిగ్గా స్పందించనప్పుడు లేదా తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయనప్పుడు సంభవిస్తుంది. డయాబెటిస్‌తో బాధపడే వ్యక్తులు తరచుగా దాహం, ఎక్కువసార్లు మూత్ర విసర్జన, అలసట, ఆకలి, బరువు తగ్గడం, అస్పష్టమైన దృష్టి వంటి లక్షణాలను అనుభవిస్తారు.
ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని డయాబెటిస్ సమస్య ప్రభావితం చేస్తుంది. దీనిని సమర్థవంతంగా నియంత్రించాలంటే ఆహారపు అలవాట్లు, వ్యాయామం, జీవనశైలిలో కొన్ని మార్పులు అవసరం. నిపుణుల ప్రకారం, డయాబెటిస్‌ను సహజంగా నియంత్రించేందుకు 5 సులభమైన చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1. మెంతి గింజల నీరు
మధుమేహం నియంత్రణలో మెంతులు చాలా ఉపయోగపడతాయి. ఇందులో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను నెమ్మదిగా చేయడంతో పాటు, చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ మెంతి గింజలను రాత్రి ఒక గ్లాసు నీటిలో నానబెట్టండి. ఉదయం ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగండి. ఇది రక్తంలోని చక్కెర స్థాయిని తగ్గించడమే కాకుండా ఇన్సులిన్ పనిచేసే తీరును కూడా మెరుగుపరుస్తుంది.
2. పచ్చి ఉల్లిపాయ సలాడ్
ఉల్లిపాయలు కూడా డయాబెటిస్ పేషెంట్లకు మంచి ఆహారంగా చెప్పవచ్చు. ఇందులో ఉన్న సల్ఫర్ సమ్మేళనాలు, ఫ్లేవనాయిడ్లు శరీరంలో ఇన్సులిన్ ప్రభావాన్ని పెంచుతాయి. ప్రతిరోజూ భోజనంలో 100 గ్రాముల పచ్చి ఉల్లిపాయను సలాడ్‌గా చేర్చుకుంటే చక్కెర స్థాయిలు 4 గంటల్లోనే తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
3. కోల్డ్ ప్రెస్డ్ నూనెలు వాడండి
వంట నూనె కూడా డయాబెటిస్ నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుంది. శుద్ధి చేసిన నూనెలు ఆరోగ్యానికి హానికరం. కాబట్టి ఆవ నూనె, కొబ్బరి నూనె, ఆలివ్ నూనె వంటివి వాడాలి. ఇవి శరీరానికి మంచి కొవ్వులు ఇస్తాయి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. దీనివల్ల రక్తంలో చక్కెర నియంత్రణ మెరుగవుతుంది.
4. భోజనం తర్వాత నడవండి
భోజనం తర్వాత కేవలం 500 అడుగులు నడవడం ద్వారా చక్కెర స్థాయిలను సమతుల్యం చేయవచ్చు. నడక వలన కండరాలు గ్లూకోజ్‌ను శక్తిగా ఉపయోగించుకోవడంతో రక్తంలో చక్కెర పెరగడం తగ్గుతుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. బరువును నియంత్రించడంలో కూడా ఉపయోగపడుతుంది.
5. రాత్రిపూట ఆమ్లా-పసుపు నీరు
ఉసిరికాయలో క్రోమియం ఉంటుందని, అది ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. పసుపులో ఉండే కర్కుమిన్ రక్తంలోని చక్కెరను తగ్గించే లక్షణాలు కలిగి ఉంటుంది. ఒక టీస్పూన్ ఉసిరి రసం, చిటికెడు పసుపు పొడి ఒక గ్లాసు నీటిలో కలిపి, నిద్రపోయే ముందు తాగండి. ఇది గ్లూకోజ్ నియంత్రణకు, కొలెస్ట్రాల్ తగ్గించడానికీ ఉపయోగపడుతుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
జాగ్రత్త.. ఈ వస్తువులు పెళ్లి ఇంట్లో ఉంటే ఇక అంతే..!
సాక్స్ లేకుండా బూట్లు వేసుకుంటే ఏమవుతుందో తెలుసా..
For More Health News