Share News

Cigarette VS Chocolate: సిగరెట్ కంటే చాక్లెట్స్ వెరీ డేంజర్..

ABN , Publish Date - Jun 02 , 2025 | 09:54 AM

చాక్లెట్, సిగరెట్ ఈ రెండింటినీ విపరీతంగా ఇష్టపడేవారు చాలా మంది ఉన్నారు. ఈ రెండూ కూడా ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని తెలిసినా కూడా వీటిని వదులుకోరు. అయితే, ఈ రెండింటిలో ఏది అత్యంత హానికరమో మీకు తెలుసా? చాలా మంది వీటిని తీసుకుంటే ఏమీ కాదులే అనే ధీమాతో ఉంటారు. అయితే, ఇది ఆరోగ్యానికి చాలా హానికరమని నిపుణులు చెబుతున్నారు.

Cigarette VS Chocolate: సిగరెట్ కంటే చాక్లెట్స్ వెరీ డేంజర్..
Cigarette VS Chocolate

Cigarette VS Chocolate: ధూమపానానికి తప్పదు భారీ మూల్యం.. పొగ తాగకండి..అంటూ ప్రభుత్వం ఎన్ని ప్రకటనలు ఇచ్చినా సరే కొంతమంది మాత్రం మేమింతే అన్నట్లుగా ప్రవర్తిస్తారు. ముఖ్యంగా యువత ఫ్యాషన్ అంటూ అదే పనిగా సిగరెట్లు కాల్చుతారు. ఇక చాక్లెట్ విషయానికి వస్తే చిన్న పిల్లలు మొదలు పెద్దల వరకు వీటిని చాలా ఇష్టంగా తింటారు. వీటిని మితంగా తీసుకుంటే పర్వలేదు కానీ ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. కొంత మంది మాత్రం వీటిని అదే పనిగా తినడానికి ఇష్టపడతారు.

Cigarette.jpg


సిగరెట్, చాక్లెట్ ఈ రెండింటికీ మార్కెట్లో డిమాండ్ ఎక్కువ. ఈ రెండూ కూడా ఆరోగ్యానికి ప్రమాదకరమని తెలిసినా కూడా వీటిని వదులుకోరు. అయితే, ఈ రెండింటిలో ఏది అత్యంత హానికరమో మీకు తెలుసా? చాలా మంది వీటిని తీసుకుంటే ఏమీ కాదులేనన్న ధీమాతో ఉంటారు. అయితే, ఇది ఆరోగ్యానికి చాలా హానికరమని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో ? ఏది ఎక్కువ హాని కలిగిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

Chocolates.jpg

సిగరెట్లు లేదా చాక్లెట్

మనం రోజూ ఐస్ క్రీం, చాక్లెట్, క్యాండీ, బిస్కెట్లు, అనేక ఇతర వస్తువులను తీసుకుంటాము, వాటిలో ఏదో ఒక విధంగా చక్కెర కలుపుతారు. చక్కెర రెండు రకాలు, ఒకటి సహజ చక్కెర, ఇది పండ్లు, పాల ఉత్పత్తులలో లభిస్తుంది. ఇది శరీరానికి ఎటువంటి సమస్యను కలిగించదు కానీ ఆహార పదార్థాలలో కలిపిన చక్కెర మన ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. దీని కారణంగా మీ ఆరోగ్యం వేగంగా క్షీణిస్తుంది. మీరు క్రమంగా చక్కెరకు బానిసలవుతారు. ఇది సిగరెట్ల కంటే ప్రమాదకరమైనది. కొకైన్ బానిసలు మాదకద్రవ్యాల పట్ల ఆకర్షితులయ్యే విధంగానే ఊబకాయం ఉన్నవారు జంక్ ఫుడ్ పట్ల ఆకర్షితులవుతారని ఒక అధ్యయనంలో తేలింది. మీరు నిరంతరం చాక్లెట్ లేదా తీపి పదార్థాలు తీసుకుంటుంటే అది మీకు సిగరెట్ కంటే ప్రమాదకరం కావచ్చని నిపుణులు చెబుతున్నారు.


Also Read:

వేడి ఆహారం తిన్న వెంటనే చల్లటి నీరు తాగుతున్నారా.. ఈ నష్టాలు తెలుసుకోండి.!

గుండె ఆరోగ్యాన్ని కాపాడే 7 ఆయుర్వేద చిట్కాలు..

For More Health News

Updated Date - Jun 02 , 2025 | 10:01 AM