Brown Rice or White Rice: బ్రౌన్ రైస్ లేదా వైట్ రైస్.. ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా..
ABN , Publish Date - Apr 27 , 2025 | 06:34 PM
బ్రౌన్ రైస్, వైట్ రైస్ రెండూ కూడా ఆరోగ్యానికి మంచివే. కానీ, ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు చేస్తుంది? బ్రౌన్ రైస్ లేదా వైట్ రైస్ ఏ బియ్యంలో ఎక్కువ పోషకాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

White Rice Or Brown Rice: ఆహారంలో బియ్యం ఒక ముఖ్యమైన భాగం. బియ్యంలో పలు రకాలు ఉంటాయి అని అందరికి తెలిసిందే. అందులో వైట్ రైస్, బ్రౌన్ రౌస్ కూడా ఉంటాయి. ఈ రెండూ కూడా ఆరోగ్యానికి మంచివే. కానీ, ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు చేస్తుంది? బ్రౌన్ రైస్ లేదా వైట్ రైస్ ఏ బియ్యంలో ఎక్కువ పోషకాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
బ్రౌన్ రైస్ - వైట్ రైస్ మధ్య తేడా
బ్రౌన్ రైస్ ఒక తృణధాన్యం. ఇది మూడు భాగాలుగా ఉంటుంది. బయటి పొర అయిన ఊకలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. మధ్య భాగంలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఖనిజాలు లోపలి భాగంలో కనిపిస్తాయి. అయితే, తెల్ల బియ్యంలో స్టార్చ్ మాత్రమే మిగిలి ఉంటుంది. తెల్ల బియ్యం త్వరగా ఉడుకుతుంది కానీ బ్రౌన్ రైస్ కంటే తక్కువ పోషకాలను కలిగి ఉంటుంది.
పోషకాలు
తెల్ల బియ్యం కంటే బ్రౌన్ రైస్‌లో ఎక్కువ ఫైబర్, విటమిన్లు ఉంటాయి. బ్రౌన్ రైస్‌లో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. బ్రౌన్ రైస్‌లో మెగ్నీషియం లభిస్తుంది, ఇది కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. బ్రౌన్ రైస్ కంటే వైట్ రైస్‌లో తక్కువ పోషకాలు ఉంటాయి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
Health Tips: ఉదయం నిద్ర లేవగానే ఇలా చేస్తే గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది..
Sleeping Tips: రాత్రి పడుకునే ముందు ఈ పనులు చేస్తే హాయిగా నిద్రపోతారు..
Real VS Fake Mangoes: జాగ్రత్త.. కల్తీ మామిడి పండ్లను ఇలా గుర్తించండి..