Sleeping Tips: రాత్రి పడుకునే ముందు ఈ పనులు చేస్తే హాయిగా నిద్రపోతారు..
ABN , Publish Date - Apr 27 , 2025 | 05:04 PM
మంచి నిద్ర మీ మానసిక, శారీరక ఆరోగ్యానికి చాలా ముఖ్యం. మీరు రాత్రిపూట సరిగ్గా నిద్రపోకపోతే మీ దినచర్యలో కొన్ని మార్పులు చేసుకోవడం మంచిది. కాబట్టి, అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ మధ్య కాలంలో చాలా మంది నిద్రలేమి సమస్యతో ఎక్కువగా బాధపడుతున్నారు. దీని వల్ల పలు అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఇందుకు కారణం మన జీవనశైలి కూడా కావొచ్చు. కాబట్టి, మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రశాంతమైన నిద్ర కూడా చాలా ముఖ్యం. మంచి నిద్ర మీ మానసిక, శారీరక ఆరోగ్యానికి చాలా అవసరం. మీరు రాత్రిపూట సరిగ్గా నిద్రపోకపోతే మీ దినచర్యలో కొన్ని మార్పులు చేసుకోవడం మంచిది. కాబట్టి, అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం..
నిర్ణీత సమయంలో పడుకోండి
మీ శరీరానికి ఒక నిర్దిష్ట దినచర్య చాలా అవసరం. క్రమం తప్పకుండా, ప్రతి రోజు ఒకే సమయంలో పడుకోవడం, నిద్రలేవడం అలవాటు చేసుకోండి.
స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయండి
పడుకునే ముందు మొబైల్ ఫోన్, టీవీ లేదా ల్యాప్‌టాప్ ఉపయోగించడం వల్ల నిద్ర హార్మోన్ అయిన మెలటోనిన్ ప్రభావితం అవుతుంది. పడుకునే ముందు పుస్తకం చదవడం లేదా డైరీ రాయడం వల్ల మీకు నిద్ర బాగా పడుతుంది.
విశ్రాంతి వాతావరణాన్ని సృష్టించండి
మంచి నిద్ర కోసం ప్రతిరోజు లైట్లు ఆఫ్ చేసి పడుకోండి. అలాగే, మృదువైన సంగీతాన్ని కూడా వినవచ్చు. ఇలా చేయడం వల్ల ప్రశాంతంగా నిద్రపోతారు. ఈ రకమైన వాతావరణం మీ మెదడుకు విశ్రాంతి, నిద్ర సమయం అని సంకేతాలు ఇస్తుంది.
పగటిపూట ఎక్కువగా నిద్రపోకండి
పగటిపూట కొద్దిసేపు పడుకోవడం ఆరోగ్యానికి మంచిదే. కానీ, ఎక్కువసేపు లేదా తప్పుడు సమయంలో నిద్రపోవడం వల్ల రాత్రిపూట మీ నిద్రపై ప్రభావం పడుతుంది. కాబట్టి, పగటి నిద్రను సరిగ్గా ప్లాన్ చేసుకోండి.
కెఫిన్ కు దూరంగా ఉండండి
కెఫీన్ మీ ఏకాగ్రత, శక్తిని పెంచుతుంది. కాబట్టి, నిద్రపోయే ముందు టీ, కాఫీ, ఎనర్జీ డ్రింక్స్ వంటివి తాగకపోవడమే మంచిది.
Also Read:
ఈ సింపుల్ టిప్స్‌తో కల్తీ మామిడి పండ్లను గుర్తించండి..
రాత్రి నిద్రలో ఈ 5 లక్షణాలు కనిపిస్తే షుగర్..
రోడ్డు పక్కన జ్యూస్ తాగే ముందు జాగ్రత్త..