Election Survey: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. ప్రజల నాడికి దగ్గర ఉన్న సర్వే!
ABN , Publish Date - Nov 14 , 2025 | 02:52 PM
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అక్కడి ప్రజలు హస్తం పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారు. అయితే.. కొన్ని సర్వే సంస్థలు జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయమని ముందే తీర్పు ఇచ్చాయి. ఇప్పుడు అందరికీ ఉన్న సందేహం ఏంటంటే.. ఈ సర్వేలను నమ్మచ్చా?.. అని.. ఇంతకీ ఈ ఉపఎన్నికపై ఏ సర్వే సంస్థ ఏం అంచనా వేసిందో చూద్దాం.
Election Surveys: ఎన్నికలైన, ఉప ఎన్నికలైన.. కేంద్రంలోనైనా.. రాష్ట్రంలోనైనా.. ఇలా ఏది జరిగినా ఓటర్ల నాడిని తెలుసుకునేందుకు.. ప్రజలు ఏ పార్టీకి పట్టం కడుతారు అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ కొన్ని సంస్థలు సర్వే చేస్తుంటాయి. అటు ప్రజలకు.. ఇటు రాజకీయ నాయకులకు ఈ సర్వేలు అంటే మక్కువ ఎక్కువ. మరి తాజాగా తెలంగాణలో జరిగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ప్రజల నాడిని ఈ సర్వే సంస్థలు పట్టుకున్నాయా?.. ప్రజల ఆలోచనకు దగ్గరగా ఏ సర్వే సంస్థ అంచనాలు ఇచ్చింది. ఇంతకీ ఈ సర్వేలను మనం సీరియస్ గా తీసుకోవచ్చా? అనేదానిపై జూబ్లీహిల్స్ ఉపఎన్నికను ఉదాహరణగా తీసుకొని విశ్లేషిద్దాం.
దగ్గరగా ఆరా మస్తాన్ సర్వే..
తెలంగాణ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారనే దానికి తెర పడింది. 24,711 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘనవిజయం సాధించారు. అయితే ఆరా మస్తాన్ సర్వే సంస్థ ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ప్రజలు ఇచ్చిన తీర్పుకు దగ్గరగా ఉంది. ఒకసారి ఆరా మస్తాన్ సంస్థ ఇచ్చిన ప్రిడిక్షన్ ను చూద్దాం. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ 47.49(+/-3) శాతంతో 27,715 ఓట్ల మెజారి.. 14.24 శాతం మార్జిన్ తో ఆ పార్టీ అభ్యర్థి గెలుస్తాడని అంచనా వేసింది. అలాగే బీఆర్ఎస్ పార్టీ 39.25(+/-3) శాతం. బీజేపీ పార్టీ 9.31(+/-2) శాతం, ఇతరులు 3.95(+/-1) శాతం అని సర్వేలో తెలిపింది. ఇప్పుడు వచ్చిన ఫలితాలు చూస్తే ఆరా మస్తాన్ సర్వే ప్రజల నాడిని కరెక్ట్ గానే అంచనా వేసిందనే చెప్పాలి.

అంచనా తప్పిన KK సర్వే..
2024లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని తమ ఎగ్జిట్ పోల్స్ ద్వారా కరెక్ట్ గా అంచనా వేసి దేశవ్యాప్తంగా KK సర్వే సంస్థ గుర్తింపు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై ఈ సర్వే సంస్థ ఇచ్చే ప్రీపోల్, ఎగ్జిట్ పోల్స్ పై చాలా మంది ఆసక్తిగా ఎదురు చూశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై ఈ సంస్థ వేసిన అంచనా ప్రకారం.. బీఆర్ఎస్ పార్టీ 55.2 శాతంతో.. 33,866 ఓట్ల మెజారి.. 17.4 శాతం మార్జిన్ తో ఆ పార్టీ అభ్యర్థి గెలుస్తాడని అంచనా వేసింది. అలాగే కాంగ్రెస్ పార్టీకి 37.8 శాతం, బీజేపీ పార్టీ 7 శాతం అని సర్వేలో తెలిపింది. కాగా ఈసారి కేకే సంస్థ జూబ్లీహిల్స్ ప్రజల నాడిని పట్టుకునే విషయంలో విఫలమైందనే చెప్పాలి. ఇచ్చిన సర్వేకు వ్యతిరేకంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి పట్టం కట్టారు.

జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై కొన్ని సంస్థల సర్వేలు ఇలా..
స్మార్ట్ సర్వే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం..
కాంగ్రెస్ (48.2),
బీఆర్ఎస్ (42.1),
బీజేపీ (7.6),
ఇతరులు (2.1)
మెజారిటీ (11872)

నాగన్న సర్వే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం..
కాంగ్రెస్ (47.84),
బీఆర్ఎస్ (41.46),
బీజేపీ (8.71),
ఇతరులు (1.99)
మెజారిటీ (12417)
![]()
చాణక్య స్టాటజీస్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం..
కాంగ్రెస్ (46),
బీఆర్ఎస్ (43),
బీజేపీ (6),
ఇతరులు (5)
మెజారిటీ (5839)
![]()
ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం..
కాంగ్రెస్ (46.5),
బీఆర్ఎస్ (41),
బీజేపీ (6),
ఇతరులు (6.5)
మెజారిటీ (10705)
![]()
పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం..
కాంగ్రెస్ (48),
బీఆర్ఎస్ (41),
బీజేపీ (6),
ఇతరులు (5)
మెజారిటీ (13624)
![]()
ఎగ్జిట్ పోల్స్ ఇచ్చే సర్వే సంస్థలు వేసిన అంచనాలు ప్రతిసారి సక్సెస్ అవ్వవు.. అలాగని ఫెయిలు అవ్వవు.. వారి తీసుకున్న శాంపిల్స్ ఆధారంగా.. నేతలు చివరి క్షణాల్లో చేసిన కార్యచరణ వంటి అనేక అంశాలపై ఆధారపడి ఎన్నికల ఫలితాలు ఉంటాయి. సర్వే సంస్థలు ఇచ్చే ప్రిడిక్షన్స్ కేవలం అంచనా కోసమే.
ఈ వార్తలు కూడా చదవండి..
రిగ్గింగ్ చేసి గెలిచిన కాంగ్రెస్: మాగంటి సునీత
ఇదే సరైన సమయం.. రండి పెట్టుబడులు పెట్టండి: ఉపరాష్ట్రపతి