Share News

Jubilee Hills Bye election: ఉత్కంఠ రేపుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు

ABN , Publish Date - Nov 14 , 2025 | 10:47 AM

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దాదాపు 3 వేలకు పై చిలుకు ఓట్ల ఆధిక్యంలో నవీన్ ఉన్నారు.

Jubilee Hills Bye election: ఉత్కంఠ రేపుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు
Jubilee Hills by-election

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills bye election) కౌంటింగ్ కొనసాగుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య నువ్వానేనా అన్నట్లు పోటీ నడుస్తోంది. వెలువుడుతున్న ఫలితాలు కూడా అందరిలో ఉత్కంఠను రేపుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఎలక్షన్ కమీషన్ వివరాల ప్రకారం... తొలి రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు 8,911 ఓట్లు పోలవగా.. బీఆర్ఎస్ అభ్యర్థిని మాగంటి సునీత గోపీనాథ్ కు 8,864 ఓట్లు లభించాయి. దీంతో తొలి రౌండ్‌లో నవీన్‌( Naveen Yadav lead) కు 47 ఓట్ల ఆధిక్యం వచ్చింది.


రెండో రౌండ్‌లో కూడా నవీన్ యాదవ్( Naveen Yadav) కు 9,691 ఓట్లు, సునీతకు 8,609 ఓట్లు వచ్చాయి. ఇప్పటి వరకు కాంగ్రెస్‌ అభ్యర్థికి 18,617, బీఆర్ఎస్(BRS) అభ్యర్థికి 17,473 ఓట్లు దక్కాయి. రెండు రౌండ్లు పూర్తయ్యే సరికి కాంగ్రెస్‌ అభ్యర్థి సుమారు 3వేలకు పైగా ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మూడు, నాలుగు రౌండ్లలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ లీడ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం 3000 ఓట్లే ఆధిక్యం కావడంతో ట్రెండ్ ఎటు మారుతుందో అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇప్పటివరకు షేక్‌పేట, ఎర్రగడ్డ, రహమత్‌నగర్‌ డివిజన్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది.


ఈ వార్తలు కూడా చదవండి..

Bihar Election Results: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే హవా

భరత్‌రామ్‌ నుంచి ప్రాణహాని ఉంది

Updated Date - Nov 14 , 2025 | 10:51 AM