Share News

Pushpma Priya: బిహార్ ఎన్నికల్లో గెలిచే వరకు మాస్క్ తీయనని మహిళ శపథం

ABN , Publish Date - Nov 14 , 2025 | 11:57 AM

బిహార్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. తాను గెలిస్తేనే ముఖానికి ధరించిన మాస్క్ ను తొలగిస్తాను అని శపథం చేసిన ఓ మహిళ.. ఓటమి అంచుల్లో ఉంది.

Pushpma Priya: బిహార్ ఎన్నికల్లో గెలిచే వరకు మాస్క్ తీయనని మహిళ శపథం
Pushpma Priya Chowdhury

బిహార్‌(Bihar Assembly 2025)లో గెలిచే వరకు మాస్క్ తీయనని శపథం చేసిన ప్లూరల్స్ పార్టీ అధ్యక్షురాలు పుష్పం ప్రియా చౌదరి.. దర్భంగా అసెంబ్లీ స్థానంలో భారీ తేడాతో వెనుకబడి ఉన్నారు. 2020లో ఈ స్థానంలో బీజేపీకి చెందిన సంజయ్ సరోగి విజయం సాధించారు. ఈసారి ఎన్నిక్లో కూడా ఆయనే బీజేపీ(BJP) తరఫున పోటీ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న కౌంటింగ్ లో సరోగి ఆధిక్యంలో ఉన్నారు. అలానే వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీ (విఐపి)కి చెందిన ఉమేష్ సహానీ 4,800 ఓట్ల వెనుకబడి ఉన్నారు. గెలిచే వరకు మాస్క్ తీయనని శపథం చేసిన ప్రియా... బీజేపీ అభ్యర్థి సరోగి కంటే 16,000 ఓట్ల వెనుకబడి ఉన్నారు.


బీహార్‌కు మత, కుల వివక్షలకు అతీతంగా కొత్త బ్రాండ్ రాజకీయాలను పరిచయం చేయాలనే లక్ష్యంతో పుష్పం ప్రియా(Pushpma Priya) 2020లో 'ది ప్లూరల్స్ పార్టీ'ని స్థాపించారు. 2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ రాష్ట్రంలోని 243 స్థానాల్లో 'విజిల్' గుర్తుపై పోటీ చేసింది. ఇక ప్రచారం సమయంలో ప్రజలను ఆకట్టుకునేందుకు వింత ప్రతిజ్ఞ చేసింది. నల్లటి దుస్తులు మరియు ముసుగులో మాత్రమే కనిపించే ఆమె ఎన్నికల్లో గెలిచిన తర్వాతే తన ముసుగును తొలగిస్తానని శపథం చేసింది. అయితే ప్రస్తుత ఫలితాల్లో ఆమె దాదాపు ఓడిపోయినట్లే కనిపిస్తుంది.


ఇక పుష్పం ప్రియా(Pushpma Priya Chowdhury mask vow)కు పొలిటికల్ బ్యాగ్రౌండ్ బాగానే ఉంది. ఆమె తండ్రి మాజీ జేడీయు శాసనసభ్యుడు వినోద్ కుమార్ చౌదరి కుమార్తె. ఆమె తాత ప్రొఫెసర్ ఉమాకాంత్ చౌదరి ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు సన్నిహితుడు. ఆమె మామ వినయ్ కుమార్ చౌదరి జెడీయు నుంచి 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బెనిపూర్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇలా ఆమె కుటుంబం అంతా రాజకీయాల్లో ఉండటంతో ప్రియం కూడా ప్రజల్లోకి రావాలని భావించింది. 2020లో ఈమె పార్టీ 148 స్థానాల్లో పోటీ చేసినా.. ఒక్కస్థానంలో కూడా గెలవలేదు. ఈసారి కూడా ఆమె పార్టీ ఖాతా తెరవడం లేదు. దీంతో పుష్ప ప్రియాపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇప్పట్లో ఈమె మాస్క్ తీయదేమో, మరో ఐదేళ్లు ఎదురు చూడాల్సిందేనా అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.



ఈ వార్తలు కూడా చదవండి..

మళ్లీ పెరిగిన ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

భరత్‌రామ్‌ నుంచి ప్రాణహాని ఉంది

Updated Date - Nov 14 , 2025 | 12:04 PM