Share News

Tejashwi Yadav Trails: సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ వెనుకంజ

ABN , Publish Date - Nov 14 , 2025 | 11:33 AM

బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రతిపక్ష కూటమి మహాగఠ్ బంధన్ కు ఊహించని షాకిస్తున్నాయి. ఆ కూటమి సీఎం అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ వెనుకంజలో ఉన్నారు.

Tejashwi Yadav Trails: సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ వెనుకంజ
Tejashwi Yadav

బిహార్ అసెంబ్లీ 2025 ఎన్నికల్లో(Bihar Assembly election) ఊహించని ఫలితాలు వస్తున్నాయి. అధికార ఎన్డీయే దూసుకెళ్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి అధికార కూటమి అత్యధిక స్థానాల్లో దూసుకెళ్తోంది. మరోవైపు ప్రతిపక్ష మహాగఠ్ బంధన్ కూ బిహార్ ఓటర్లు ఊహించని షాకిస్తున్నారు. ఈ క్రమంలో మహాగఠ్ బంధన్ తరఫున్ సీఎం అభ్యర్థిగా ఉన్న ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్(Tejashwi Yadav) వెనుకంజలో ఉన్నారు. వారి కుటుంబానికి కుంచుకోట అయినా రఘోపూర్ అసెంబ్లీ స్థానంలో ఆయన వెనుకబడి ఉన్నారు. ఆయనపై బీజేపీ అభ్యర్థి సతీష్ కుమార్ ముందజలో ఉన్నారు. ఇది ఆర్జేడీతో పాటు మహాగఠ్ బంధన్ కూటమికి ఊహించని షాకని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.


వెలువడుతోన్న బిహార్ అసెంబ్లీ ఫలితాల్లో(Bihar Assembly election 2025) రఘోపూర్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థి సతీష్ కుమార్ యాదవ్ 3వేల పై చిలుకు ఓట్ల మెజార్టీలో కొనసాగుతున్నారు. ఎలక్షన్ కమీషన్ వెల్లడిస్తున్న వివరాల ప్రకారం.. నాలుగు రౌండ్లు ముగిసేసరికి బీజేపీ అభ్యర్థికి 17,599 ఓట్లు పోలవగా.. తేజస్వి యాదవ్ కు 14, 583 ఓట్లు సాధించాడు. గతంలో, తేజస్వి యాదవ్ తండ్రి, మాజీ సీఎం ఆర్జేడీ వ్యవస్థాపకుడు లాలు ప్రసాద్ యాదవ్ ఈ స్థానాంలో గెలుస్తూ వచ్చారు.


ఇక 2015 నుండి తేజస్వి రఘోపూర్(Raghopur)కి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2020 ఎన్నికల్లో తేజస్వీ యాదవ్ ఈ స్థానాన్ని 38,000 కంటే ఎక్కువ ఓట్ల తేడాతో గెలుచుకున్నారు. ఈసారి తేజస్వి యాదవ్ పై బీజేపీ సతీష్ కుమార్ యాదవ్‌ను అభ్యర్థిగా నిలబెట్టింది. అతను 2010 ఎన్నికల్లో జేడీయూ అభ్యర్థి, తేజస్వీ తల్లి అయినా రబ్రీ దేవిని ఓడించారు. ప్రశాంత్ కిషోర్ జన్ సూరాజ్ పార్టీ కూడా రాఘోపూర్‌లో అభ్యర్థిని నిలబెట్టింది. కానీ, ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది.


ఇవీ చదవండి:


Jubilee Hills Bye election: ఉత్కంఠ రేపుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు

ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసు.. ఉమర్ బంధువు అరెస్ట్..

Updated Date - Nov 14 , 2025 | 12:17 PM