Bihar Elections: కోటి ఉద్యోగాలు, కేజీ టు పీజీ ఉచిత విద్య.. బిహార్ ఎన్డీయే మేనిఫెస్టో విడుదల
ABN , Publish Date - Oct 31 , 2025 | 02:39 PM
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా , ముఖ్యమంత్రి, జనతాదళ్ నేత నితీష్ కుమార్ శుక్రవారంనాడిక్కడ జరిగిన కార్యక్రమంలో కూటమి 'సంకల్ప్ పత్ర'ను విడుదల చేశారు.
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) విడుదల చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda), ముఖ్యమంత్రి, జనతాదళ్ (JDU) నేత నితీష్ కుమార్ (Nitish Kumar) శుక్రవారనాడిక్కడ జరిగిన కార్యక్రమంలో కూటమి 'సంకల్ప్ పత్ర' (Sankalp Patra)ను విడుదల చేశారు. ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, కేంద్రమంత్రి-లోక్ జన్‌శక్తి పార్టీ (రామ్ విలాస్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్, రాష్ట్రీయ లోక్ మంచ్ (ఆర్ఎల్ఎం) సుప్రీం ఉపేంద్ర కుష్వాహ హాజరయ్యారు.
ఎన్డీయే మేనిఫెస్టోలో వాగ్దానాలు
-యువతకు కోటి ఉద్యోగాలు
- ప్రతి జిల్లాలోనూ మెగా స్కిల్ కేంద్రాల ఏర్పాటు చేసి గ్లోబల్ స్కిల్లింగ్ కేంద్రాలుగా తీర్చిదిద్దడం.
-ఈబీసీలకు రూ.10 లక్షల చేయూత, సుప్రీంకోర్టు న్యాయమూర్తితో కమిషన్ ఏర్పాటు
-మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి మిలయనీర్లు చేయడం
-బిహార్‌లో 7 ఎక్స్‌ప్రెస్ హైవేల నిర్మాణం
-పాట్నాతో సహా నాలుగు నగరాల్లో మెట్రో సేవలు
-బిహార్‌లో 10 కొత్త ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటు
-5 ఏళ్లలో రూ.50 లక్షల పెట్టుబడులను ఆకర్షించడం
-కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య
-ప్రతి జిల్లాలోనూ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లు
-ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు వన్-టైమ్ సాయంగా రూ.2,000
-బిహార్‌లో వరల్డ్ క్లాస్ మెడిసిటీ ఏర్పాటు, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ
-మేడ్ ఇన్ బిహార్ స్కీమ్ ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను రెట్టింపు చేయడం
-'వోకల్ ఫర్ లోకల్' కింద 100 ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు
-జిగ్ వర్కర్లు, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం, స్కిల్ డవలప్‌మెంట్
-ఐదేళ్లలో న్యూ-ఏజ్ ఎకానమీని అభివృద్ధి చేసి బిహార్‌ను గ్లోబల్ వర్క్‌ప్లేస్‌గా తీర్చిదిద్దడం
డిప్యూటీ సీఎం సంచలన కామెంట్స్.. ఎంపీ తేజస్వీ సూర్య.. ఓ వేస్ట్ మెటీరియల్
పొత్తుపై టీవీకేతో మంతనాలు జరపలేదు..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి