Share News

Bihar Elections: ఉపాధి, మహిళా భద్రతకు భరోసా.. సీపీఎం మేనిఫెస్టో

ABN , Publish Date - Nov 01 , 2025 | 08:16 PM

బిహార్‌లో తగినంత వర్క్‌ఫోర్స్, వనరులు ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని బీజేపీ, నితీష్ ప్రభుత్వ భ్రష్టు పట్టించాయని బృందాకారత్ అన్నారు. గత 20 ఏళ్లుగా రాష్ట్రాన్ని లూటీ చేశారని విమర్శించారు.

Bihar Elections: ఉపాధి, మహిళా భద్రతకు భరోసా.. సీపీఎం మేనిఫెస్టో
CPM Manifesto

పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో(Bihar Elections Manifesto)ను సీపీఎం (CPM) శనివారంనాడు విడుదల చేసింది. పార్టీ సీనియర్ నేత బృందా కారత్ (Brinda Karat) ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. 'ఇండియా' కూటమి భాగస్వామిగా బిహార్ ఎన్నికల్లో సీపీఎం పోటీ చేస్తోంది. పార్టీ మేనిఫెస్టో విడుదల అనంతరం బృందా కారత్ మాట్లాడుతూ, ఉద్యోగాల కల్పన, మహిళా హక్కులు, భద్రత, కార్మికులకు తగిన వేతనాలకు సీపీఎం కట్టుబడి ఉందని చెప్పారు.


బిహార్‌లో తగినంత వర్క్‌ఫోర్స్, వనరులు ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని బీజేపీ, నితీష్ ప్రభుత్వం భ్రష్టు పట్టించాయని బృందాకారత్ అన్నారు. గత 20 ఏళ్లుగా రాష్ట్రాన్ని లూటీ చేశారని విమర్శించారు. ప్రత్యామ్నాయ అభివృద్ధి విధానాలతో బలమైన ప్రత్నామ్నాయంగా మహాగట్‌బంధన్ ఈ ఎన్నికల్లో బిహార్ ప్రజల ముందుకు వచ్చిందన్నారు. అధికార ఎన్డీయే నిరాశానిస్పృహలతో ఉందని, చేసిన అభివృద్ధి ఏదీ లేకపోవడంతో విపక్షాలపై నెగిటివ్ ప్రచారానికి పాల్పడుతోందని అన్నారు.


మోకామాలో ఎన్నికల ప్రచారం సందర్భంగా జన్ సురాజ్ పార్టీ మద్దతుదారు దులార్ చంద్ యాదవ్‌ హత్యకు గురికావడంపై బృందాకారత్ మాట్లాడుతూ, ఎన్డీయే హయాంలో మాఫియా రాజ్, జంగిల్ రాజ్ నడుస్తోందనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. అదుపు తప్పిన శాంతిభద్రతలను తిరిగి 'ఇండియా' కూటమి పట్టాలపైకి తెస్తుందని చెప్పారు.


ఇవి కూడా చదవండి..

మా ఇద్దరిలో ఎవరైనా చెబితేనే నమ్మండి.. నాయకత్వ మార్పు ఊహాగానాలపై డీకే

మాతృభాషను బలహీన పరుస్తున్న హిందీ, ఇంగ్లీష్... సీఎం కీలక వ్యాఖ్యలు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 01 , 2025 | 08:21 PM