Bihar Exit Polls 2025: ఎన్డీయేదే విజయం.. 7 ఎగ్జిట్ సర్వేలు జోస్యం
ABN , Publish Date - Nov 11 , 2025 | 07:17 PM
ఎన్డీయేకు 145 నుంచి 160 సీట్లు వస్తాయని 'దైనిక్ భాస్కర్' ఎగ్జిట్ పోల్ పేర్కొంది. ఎన్డీయేకు 147 నుంచి 167 సీట్లు వస్తాయని మాట్రిజ్ అంచనా వేసింది.
పాట్నా: బీజేపీ సారథ్యంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA)కు ప్రధాన ఎగ్జిట్ పోల్ సర్వేలు పట్టం కట్టాయి. ఎన్డీయే కూటమి తిరిగి అధికారంలోకి రాబోతోందని తెలిపాయి. ఎన్డీయేకు 145 నుంచి 160 సీట్లు వస్తాయని 'దైనిక్ భాస్కర్' (Dainik Bhaskar) ఎగ్జిట్ పోల్ పేర్కొంది. ఎన్డీయేకు 147 నుంచి 167 సీట్లు వస్తాయని మాట్రిజ్ (Matrize) అంచనా వేసింది. పీపుల్స్ పల్స్ (Peoples Pulse) ఎన్డీయేకు 133 నుంచి 159 సీట్లు, పీపుల్స్ ఇన్‌సైట్ (People's Insight) 133 నుంచి 149 సీట్లు వస్తాయని అంచనా వేశాయి. మెజారిటీకి 122 సీట్లు అవసరం కాగా, ఈ నాలుగు సర్వేల్లోనూ ఎన్డీయే దూసుకుపోయింది.
కాగా, మాట్రిజ్ సర్వే ప్రకారం మహాగఠ్‌బంధన్ (ఎంజీబీ) 70 నుంచి 90 సీట్లు, జేఎస్‌పీ (జన్‌సురాజ్ పార్టీ) 0-2 సీట్లు, ఇతరులు 2-8 సీట్లు గెలుచుకుంటాయని అంచనా వేసింది. పీపుల్స్ పల్స్ అంచనా ప్రకారం ఎంజీబీ 75 నుంచి 101 సీట్లు, జేఎస్‌పీ 0 నుంచి 5 సీట్లు, ఇతరులు 2 నుంచి 8 సీట్లు గెలుచుకుంటాయి. పీపుల్స్ ఇన్‌సైట్ అంచనా ప్రకారం ఎంజీబీ 87 నుంచి 102 సీట్లు, జేఎస్‌పీ 0 నుంచి 2 సీట్లు, ఇతరులు 3 నుంచి 6 సీట్లు గలుచుకుంటాయి.
పీమార్క్ (P-MARQ) ఎన్డీయేకు 142 నుంచి 162 సీట్లు వస్తాయని అంచనా వేసింది. మహాగఠ్‌బంధన్ 80 నుంచి 98, జేఎస్‌పీ 1 నుంచి 4, ఇతరులు 0 నుంచి 3 సీట్లు గెలుచుకుంటారని అంచనావేసింది. జేవీసీ (JVC) ఎగ్జిట్ పోల్ అంచనా ప్రకారం ఎన్డీయే 135 నుంచి 150 సీట్లు గెలుచుకుంటుంది. ఇండియా కూటమికి 83 నుంచి 103 సీట్లు వస్తాయి. డీవీసీ రీసెర్చ్ (DVC reserach) పోల్స్ సర్వే ప్రకారం ఎన్డీయే 137 నుంచి 152 సీట్లు గెలుచుకుంటుంది. మహాగఠ్‌బంధన్ 83 నుంచి 98 సీట్లు, జన్‌సురాజ్ 2 నుంచి 4, ఇతరులు 4 నుంచి 8 సీట్లు గెలుచుకుంటారని తెలిపింది.
మరో రెండు సర్వేలు
చాణక్య (Chanakya) సర్వే ప్రకారం ఎన్డీయే 130 నుంచి 138 సీట్లు గెలుచుకుంటుంది. ఎంజీబీ 100 నుంచి 108, ఇతరులకు 3 నుంచి 5 సీట్లు వస్తాయి. టైమ్స్ నౌ (Times now) సర్వే ప్రకారం ఎన్డీయే 129 సీట్లు గెలుచుకుంటుంది. ఎంజీబీ 86 సీట్లు, జేఎస్‌పీ 2 సీట్లు, ఇతరులు 3 సీట్లు దక్కిచుకుంటారు.
ఇవి కూడా చదవండి..
ముగిసిన బిహార్ రెండో విడత ఎన్నికల పోలింగ్.. రికార్డ్ స్థాయిలో ఓటింగ్
ఢిల్లీ పేలుళ్ల కేసు ఎన్ఐఏకి అప్పగింత
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి