Akhilesh Yadav: బిహార్‌లో ఎన్డీయే ఆధిక్యంపై తొలిసారి స్పందించిన అఖిలేష్ యాదవ్
ABN , Publish Date - Nov 14 , 2025 | 01:37 PM
బిహార్ అసెంబ్లీ ఎన్నికలపై ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందించారు. వారి మోసాన్ని యూపీలో సాగనివ్వమంటూ బీజేపీపై ఫైర్ అయ్యారు.
బిహార్ అసెంబ్లీ 2025(Bihar election 2025) ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే అఖండ విజయం దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం డబుల్ సెంచరీ స్థానాల్లో ఎన్డీయే అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కొన్ని స్థానాల్లో మహాగఠ్ బంధన్, ఎన్డీయే(NDA) మధ్య నువ్వానేనా అన్నట్లు పోటీ నడుస్తోంది. ఇక బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే ఆధిక్యంలో ఉండటంపై యూపీ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తొలిసారి స్పందించారు.
ఎన్నికల కమీషన్ తీసుకొచ్చిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటరు (SIR) బిహార్ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే ఆధిక్యంలో ఉండేందుకు సాయం చేసిందని అఖిలేష్ ఆరోపించారు. అయితే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఇతర రాష్ట్రాలలో 'SIR గేమ్' పనిచేయదని ఆయన అన్నారు. బిహార్‌లో SIR ఆడిన ఆట ఇకపై పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ లేదా ఇతర చోట్ల సాధ్యం కాదని, ఎందుకంటే ఈ ఎన్నికల ఫలితాలతో కుట్ర బహిర్గతమైందని ఆయన ఎక్స్ ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు. భవిష్యత్ ఎన్నికల్లో వారిని(ఎన్డీయే) ఆట ఆడనివ్వము... మేము అప్రమత్తంగా ఉండి బిజెపి ప్రణాళికలను అడ్డుకుంటామని తెలిపారు. బీజేపీ ఒక పార్టీ కాదని, కానీ మోసగాడంటూ అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) తీవ్ర విమర్శలు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Nitish Kumar: ఆపేదెవరు.. బీహార్‌లో నితీశ్ ఏకఛత్రాధిపత్యం..
భరత్‌రామ్ నుంచి ప్రాణహాని ఉంది