Spot Admissions For ESET: నేడు జేఎన్‌టీయూలో ఈసెట్ స్పాట్ అడ్మిషన్లు
ABN , Publish Date - Jul 31 , 2025 | 05:16 AM
జేఎన్‌టీయూ అనుబంధ కళాశాలల్లో నేరుగా బీటెక్, ఫార్మసీ సెకండియర్‌లో ప్రవేశానికి నిర్వహించే ఈసెట్‌లో

హైదరాబాద్ సిటీ, జూలై 30 (ఆంధ్రజ్యోతి): జేఎన్‌టీయూ అనుబంధ కళాశాలల్లో నేరుగా బీటెక్, ఫార్మసీ సెకండియర్‌లో ప్రవేశానికి నిర్వహించే ఈసెట్‌లో.. కౌన్సెలింగ్ అనంతరం మిగిలిపోయిన సీట్ల భర్తీ కోసం గురువారం ’స్పాట్ అడ్మిషన్ల’ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు అడ్మిషన్ల విభాగం డైరెక్టర్ బాలు నాయక్ తెలిపారు. ఈసెట్‌కు అర్హత కలిగిన అభ్యర్థులంతా.. హైదరాబాద్ క్యాంప్‌సలో జరిగే సెంట్రలైజ్డ్ కౌన్సెలింగ్ ప్రక్రియకు హాజరు కావచ్చని తెలిపారు. వర్సిటీకి అనుబంధంగా ఉన్న పాలేరు, మహబూబాబాద్, వనపర్తి, సిరిసిల్ల, సుల్తాన్‌పూర్, జగిత్యాల, మంథనిలలోని ప్రభుత్వ కళాశాలల్లో మిగిలిన 180 సీట్లను స్పాట్ అడ్మిషన్లకు(అర్హులైన) వచ్చిన అభ్యర్థులతో భర్తీ చేస్తామని డైరెక్టర్ వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తప్పు చేస్తే జగన్ అరెస్ట్ కావడం ఖాయం: ఏపీ బీజేపీ చీఫ్
ఈ ఆకును నాన్ వేజ్‌తో కలిపి వండుకుని తింటే ..
For More International News And Telugu News