Share News

Hyderabad NMDC Jobs: హైదరాబాద్ ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. అప్లై చేశారా, ఇదే లాస్ట్ ఛాన్స్

ABN , Publish Date - Jun 13 , 2025 | 05:37 PM

హైదరాబాద్‌లో ఉద్యోగం కోసం చూస్తున్న ఉద్యోగార్థులకు మంచి ఛాన్స్ వచ్చింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NMDC Hyderabad Jobs)లో 995 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో ఫీల్డ్ అటెండెంట్, ఎలక్ట్రిషియన్ సహా అనేక పోస్టులు ఉన్నాయి. వీటికి అప్లై చేయడంతోపాటు, జీతభత్యాలు ఎలా ఉన్నాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Hyderabad NMDC Jobs: హైదరాబాద్ ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. అప్లై చేశారా, ఇదే లాస్ట్ ఛాన్స్
Hyderabad NMDC Jobs

హైదరాబాద్: భారత ప్రభుత్వ సంస్థ నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NMDC Hyderabad Jobs) మరోసారి ఉద్యోగార్థులకు మంచి అవకాశాన్ని అందిస్తోంది. 2025కు సంబంధించి వివిధ విభాగాల్లో 995 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాగా.. దరఖాస్తు చివరి తేదీ దగ్గరపడింది. ఫీల్డ్ అటెండెంట్ నుంచి హెచ్.ఇం. ఆపరేటర్ వరకు, వివిధ స్థాయిల పోస్టులు ఈ నోటిఫికేషన్‌లో ఉన్నాయి. అయితే ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేయాలి, అర్హతలు, వేతనాలు ఎలా ఉన్నాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


ముఖ్యమైన తేదీ

  • ఈ పోస్టులకు అప్లై చేసేందుకు చివరి తేదీ జూన్ 14, 2025

పోస్టుల వివరాలు

  • ఫీల్డ్ అటెండెంట్ (ట్రైనీ) రూ.18,100 – రూ.31,850

  • మెయింటెనెన్స్ అసిస్టెంట్ (ఎలక్ట్రికల్) రూ.18,700 – రూ.32,940

  • మెయింటెనెన్స్ అసిస్టెంట్ (మెకానికల్) రూ.18,700 – రూ.32,940

  • బ్లాస్టర్ గ్రేడ్-II (ట్రైనీ) రూ.19,900 – రూ.35,040

  • ఎలక్ట్రిషియన్ గ్రేడ్-III (ట్రైనీ) రూ.19,900 – రూ.35,040

  • ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్ గ్రేడ్-III రూ.19,900 – రూ.35,040

  • హెచ్.ఇం. మెకానిక్ గ్రేడ్-III (ట్రైనీ) రూ.19,900 – రూ.35,040

  • హెచ్.ఇం. ఆపరేటర్ గ్రేడ్-III (ట్రైనీ) రూ.19,900 – రూ.35,040

  • మోటార్ క్రూయిజ్ ఆపరేటర్ గ్రేడ్-3(ట్రైనీ) రూ.19,900 – రూ.35,040

  • క్వాలిటీ కంట్రోల్ అసిస్టెంట్ గ్రేడ్-III రూ.19,900 – రూ.35,040


అర్హతలు (NMDC Hyderabad Jobs)

  • ఫీల్డ్ అటెండెంట్: టెన్త్ లేదా ITI

  • మెయింటెనెన్స్ అసిస్టెంట్ (ఎలక్ట్రికల్/మెకానికల్): ITI

  • ఎలక్ట్రిషియన్ గ్రేడ్-III: డిప్లొమా (ఎలక్ట్రికల్)

  • బ్లాస్టర్ గ్రేడ్-II: మెట్రిక్/ITI, బ్లాస్టర్/మైనింగ్ మేట్ సర్టిఫికేట్, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్

  • ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్ గ్రేడ్-III: డిప్లొమా (ఎలక్ట్రానిక్స్)

  • హెచ్.ఇం. మెకానిక్ గ్రేడ్-III: డిప్లొమా (మెకానికల్)

  • హెచ్.ఇం. ఆపరేటర్ గ్రేడ్-III: డిప్లొమా (మెకానికల్)

  • మోటార్ క్రూయిజ్ ఆపరేటర్ గ్రేడ్-III: డిప్లొమా (మెకానికల్)

  • క్వాలిటీ కంట్రోల్ అసిస్టెంట్ గ్రేడ్-III: B.Sc (కెమిస్ట్రీ/జియాలజీ)


వయో పరిమితి:

  • కనీస వయస్సు 18 సంవత్సరాలు

  • గరిష్టంగా 30 సంవత్సరాలు (2025 జూన్ 14 నాటికి)

  • SC/ST/PwBD/Ex-servicemen అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు

  • సాధారణ అభ్యర్థులు: రూ.150

  • SC/ST/PwBD/Ex-servicemen/Departmental అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు

ఎంపిక విధానం

  • రాతపరీక్ష: ప్రాథమిక పరీక్ష

  • ట్రేడ్ టెస్ట్: సంబంధిత వృత్తి పరీక్ష

  • ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్: ఫీల్డ్ అటెండెంట్ పోస్టులకు

  • డాక్యుమెంట్ వెరిఫికేషన్: అంతిమ ఎంపిక కోసం

దరఖాస్తు విధానం

  • NMDC అధికారిక వెబ్‌సైట్ nmdc.co.inకు ముందుగా వెళ్లండి

  • Careers విభాగంలో Recruitment లింక్‌పై క్లిక్ చేయండి

  • ఆ తర్వాత దరఖాస్తు ఫారమ్‌ను నింపండి

  • సంబంధిత డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి

  • ఫీజు చెల్లించి, దరఖాస్తును సమర్పించండి


ఈ వార్తలు కూడా చదవండి..

మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..


పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. జూన్ 15 లాస్ట్ డేట్, లేదంటే..

For National News And Telugu News

Updated Date - Jun 13 , 2025 | 05:56 PM