NDA recruitment 2025: ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. నెలకు లక్షా 70 వేల జీతం..
ABN , Publish Date - Jun 08 , 2025 | 02:53 PM
కేంద్ర ప్రభుత్వంలో మంచి ఉద్యోగాల కోసం చూస్తున్న యువతకు గుడ్ న్యూస్. నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA), నేవల్ అకాడమీ (NA) ఇటీవల 408 పోస్టులకు నోటిఫికేషన్ (NDA recruitment 2025) విడుదల చేసింది. అయితే ఈ పోస్టుల అర్హత ఏంటి, ఎలా అప్లై చేయాలనే తదితర వివరాలను ఇక్కడ చూద్దాం.

దేశ సేవనే లక్ష్యంగా భారత రక్షణ దళాలలో జాబ్ చేయాలని చూస్తున్నవారికి మంచి ఛాన్స్ వచ్చింది. ఈ క్రమంలో నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA), నేవల్ అకాడమీ (NA) రెండో విడత (NDA II)లో 406 పోస్టులకు నోటిఫికేషన్ (NDA recruitment 2025) విడుదల చేసింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) మే 28, 2025న వీటిని ప్రకటించగా, జూన్ 17, 2025 వరకు వీటికి అప్లై చేసుకునేందుకు ఛాన్సుంది. ఈ పోస్టులకు ఎంపికైన వారికి భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వంటి గౌరవప్రదమైన విభాగాల్లో సేవ చేసే అవకాశం లభిస్తుంది.
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: మే 28, 2025
ఆన్‌లైన్ దరఖాస్తుల ముగింపు: జూన్ 17, 2025 (రాత్రి 11:59 వరకు)
రాత పరీక్ష తేదీ: సెప్టెంబర్ 14, 2025
అడ్మిట్ కార్డుల విడుదల: సెప్టెంబర్ మొదటి వారం
అర్హత ప్రమాణాలు
అభ్యర్థులు జనవరి 2, 2007 నుంచి జనవరి 1, 2010 మధ్య జన్మించిన వారై ఉండాలి
విద్యార్హత:
ఆర్మీ విభాగం: 12వ తరగతి లేదా సమానమైన పరీక్ష ఉత్తీర్ణత
ఎయిర్ ఫోర్స్ / నేవీ / 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్: 12వ తరగతి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌తో ఉత్తీర్ణత కల్గి ఉండాలి
జాతీయత: భారత పౌరుడు లేదా నేపాల్/భూటాన్ పౌరుడు లేదా ఇతర నిర్దిష్ట ప్రమాణాలు కలిగిన వ్యక్తులు కూడా అప్లై చేసుకోవచ్చు
దరఖాస్తు ఫీజు
సాధారణ/OBC అభ్యర్థులు: రూ.100 చెల్లించాలి
SC/ST/మహిళా అభ్యర్థులు / JCOs/NCOs/ORs వారసులకు ఎలాంటి ఫీజు లేదు
పరీక్ష విధానం
రాత పరీక్ష రెండు భాగాలుగా ఉంటుంది. మ్యాథమెటిక్స్ 300 మార్కులు, 2.5 గంటలు
జనరల్ అబిలిటీ టెస్ట్ (GAT): 600 మార్కులు, 2.5 గంటలు
మొత్తం మార్కులు: 900
రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు SSB ఇంటర్వ్యూ (900 మార్కులు)కు ఎంపిక చేయబడతారు
జీత భత్యాలు (నెలకు)
కేడెట్ ట్రైనింగ్ సమయంలో: స్టైపెండ్: రూ.56,100
పోస్టింగ్ తర్వాత Lieutenant: రూ. 56,100 – రూ. 1,77,500
Captain: రూ.61,300 – రూ.1,93,900
Major: రూ.69,400 – రూ.2,07,200
Lieutenant Colonel: రూ.1,21,200 – రూ.2,12,400
Colonel: రూ.1,30,600 – రూ.2,15,900
Brigadier: రూ.1,39,600 – రూ.2,17,600
Major General: రూ.1,44,200 – రూ.2,18,200
Lieutenant General (HAG Scale): రూ.1,82,200 – రూ.2,24,100
Military Service Pay (MSP): రూ.15,500
దరఖాస్తు ప్రక్రియ
ఈ అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది. మొదటి దశలో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. ఆ తర్వాత దశలో వ్యక్తిగత, విద్యార్హత వివరాలు నమోదు చేయండి. తర్వాత స్కాన్ చేసిన ఫోటో, సంతకం, ఐడీ ప్రూఫ్, విద్యార్హత సర్టిఫికేట్లు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. చివరికు ఫీజు చెల్లించి, దరఖాస్తును సమర్పించాలి.
ఇవీ చదవండి:
దేశంలో ట్సాక్స్ ఫ్రీ స్టేట్ గురించి తెలుసా.. ఎంత సంపాదించినా
4 శాతం వడ్డీకే రూ.3లక్షల లోన్.. రైతులకు కేంద్రం ఆఫర్..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..