NaBFIDలో అనలిస్టు పోస్టులకు నోటిఫికేషన్.. రూ.14 లక్షల జీతంతో మంచి ఛాన్స్
ABN , Publish Date - Apr 27 , 2025 | 02:47 PM
పీజీ చేసిన ఉద్యోగార్థులకు అదిరిపోయే న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే NaBFIDలో పలు రకాల పోస్టులకు నోటిఫికేషన్ వచ్చేసింది. వీటికి నిన్నటి (ఏప్రిల్ 26, 2025న) నుంచి అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఉద్యోగాలకు వార్షిక వేతనం రూ.14 లక్షలకుపైగా ఉండటం విశేషం.

ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్న వారికి గుడ్ న్యూస్ వచ్చింది. రూ.14 లక్షల వార్షిక వేతనం ఉన్న ఉద్యోగాలకు నిన్న (ఏప్రిల్ 26, 2025న) నోటిఫికేషన్ వెలువడింది. ఈ క్రమంలో నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ (NaBFID) మౌలిక సదుపాయాల రంగంలో 66 అనలిస్టు పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టుల ద్వారా అభ్యర్థులు ఫైనాన్స్ సహా పలు రంగాల్లో ప్రతిష్టాత్మక ఉద్యోగం పొందే ఛాన్సుంది. 66 పోస్టులు వివిధ రంగాల్లో అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు తమ నైపుణ్యాలకు అనుగుణంగా ఆయా ఉద్యోగాలకు అప్లై చేయాల్సి ఉంటుంది.
NaBFIDలో అనలిస్టు పోస్టులకు అర్హతలు
విద్యా అర్హత: అభ్యర్థులు తమ సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసి ఉండాలి
వయోపరిమితి: అభ్యర్థులు 2024 జూన్ 1 నాటికి 21–32 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు కూడా ఉంటుంది
అనుభవం: సంబంధిత రంగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది
అందుబాటులో ఉన్న పోస్టుల వివరణ
NaBFIDలోని అనలిస్టు పోస్టులు వివిధ స్ట్రీమ్‌లలో ఉన్నాయి. ఈ పోస్టుల ద్వారా అభ్యర్థులకు కేవలం ఉద్యోగం మాత్రమే కాదు, ఒక మంచి కెరీర్ అభివృద్ధి కూడా ఉంటుంది.
లెండింగ్ ఆపరేషన్స్: ఈ విభాగంలో అనలిస్టులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం రుణాలను అంచనా వేయడం, నిర్వహించడం బాధ్యతగా ఉంటుంది.
మానవ వనరులు: ఇందులో నియామకాలు, శిక్షణ, ఉద్యోగుల సంక్షేమం నిర్వహించడం
పెట్టుబడి & ట్రెజరీ: NaBFID ఆర్థిక ఆస్తులను, పెట్టుబడులను, ట్రెజరీ మేనేజ్మెంట్ బాధ్యత
సమాచార సాంకేతికత (IT): ఈ విభాగం NaBFID డిజిటల్ మౌలిక సదుపాయాలను నిర్వహిస్తుంది
పరిపాలన విభాగం : సజావుగా కార్యకలాపాలను నిర్వహించడం
అకౌంటింగ్: ఆర్థిక లావాదేవీలు, అకౌంటింగ్, రికార్డ్‌ల నిర్వహణ
రిస్క్ నిర్వహణ: బ్యాంకు కార్యకలాపాలను ప్రభావితం చేసే నష్టాలను గుర్తించడం, తగ్గించడం
వ్యూహాత్మక అభివృద్ధి: దీర్ఘకాలిక ప్రణాళికలు, వ్యూహాలు, వ్యాపార అభివృద్ధిని నిర్వహించడం
ఆర్థికవేత్త: NaBFID ఆర్థిక నిర్ణయాలకు సపోర్ట్ చేసేందుకు డేటా, విశ్లేషణ
దరఖాస్తు ప్రక్రియ
NaBFIDలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి గల అభ్యర్థులు మే 19, 2025లోపు అప్లై (https://nabfid.org/) చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 26, 2025 నుంచి ప్రారంభమైంది.
జీతం, ప్రయోజనాలు
NaBFID ఉద్యోగాలకు సాలరీ ప్యాకేజీ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు సుమారు రూ. 14.83 లక్షలు వార్షిక జీతం చెల్లించబడుతుంది. ఇది విధి నిర్వహణపై ఆధారపడి వేరియబుల్ భాగం కూడా ఇందులో ఉంటుంది. అలాగే, ఉద్యోగులు వైద్య బీమా, ప్రమాద బీమా, జీవిత బీమా వంటి అనేక ప్రయోజనాలు కూడా పొందుతారు.
దరఖాస్తు ఫీజు
జనరల్/EWS/OBC అభ్యర్థులకు రూ.800
SC/ST/PwBD అభ్యర్థులకు రూ.100
ఇవి కూడా చదవండి:
Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..
TRAI: సిగ్నల్, నెట్ లేకపోతే సైలెంట్ కాదు..ఫిర్యాదు చేయడం మరింత ఈజీ తెలుసా..
Read More Business News and Latest Telugu News