JEE Advanced 2025: జేఈఈ అభ్యర్థులకు అప్‌డేట్..అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్, ఎగ్జామ్ డేట్స్ ఆగయా..
ABN , Publish Date - Apr 21 , 2025 | 11:52 AM
జేఈఈ అభ్యర్థులకు కీలక అలర్ట్ వచ్చేసింది. మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థులు ఇకపై అడ్వాన్స్‌డ్‌కి సిద్ధం కావాలి. ఎందుకంటే తాజాగా JEE అడ్వాన్స్‌డ్ 2025 రిజిస్ట్రేషన్, ఎగ్జామ్ తేదీలను కూడా అనౌన్స్ చేసింది.

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(JEE) అడ్వాన్స్‌డ్ 2025 నమోదు కోసం కౌంట్‌డౌన్ మొదలైంది. ఏప్రిల్ 23 ఉదయం 10 గంటల నుంచి ఐఐటీ కాన్పూర్ అధికారిక వెబ్‌సైట్ jeeadv.ac.inలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికోసం JEE మెయిన్ 2025లో అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ మే 2, 2025 (రాత్రి 11:59 గంటల వరకు), ఫీజు చెల్లింపు మే 5, 2025లోపు పూర్తి చేయాలి.
JEE అడ్వాన్స్‌డ్ 2025 దరఖాస్తు ఫీజు వివరాలు
JEE అడ్వాన్స్‌డ్ 2025 దరఖాస్తు ఫీజు కేటగిరీల వారీగా భిన్నంగా ఉంటుంది
SC, ST, PwD, మహిళా అభ్యర్థులకు రూ. 1,600
ఇతర (జనరల్, OBC, EWS మొదలైనవి) అభ్యర్థులకు రూ. 3,200
ఫీజు చెల్లింపు ఆన్‌లైన్‌లో అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే చెల్లించాలి. ఫీజు చెల్లించడానికి చివరి తేదీ మే 5, 2025 కాబట్టి, అభ్యర్థులు ఈ తేదీని గుర్తుంచుకోవాలి. ఫీజు చెల్లించని దరఖాస్తులు రద్దు చేయబడతాయి కాబట్టి, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి.
JEE అడ్వాన్స్‌డ్ 2025 ముఖ్యమైన తేదీలు
రిజిస్ట్రేషన్ తేదీలు: ఏప్రిల్ 23, 2025 నుంచి మే 2, 2025 వరకు
ఫీజు చెల్లింపు చివరి తేదీ: మే 5, 2025
అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్: మే 11, 2025 నుంచి మే 18, 2025 (మధ్యాహ్నం 2:30 గంటల వరకు)
PwD అభ్యర్థులకు స్క్రైబ్ ఎంపిక: మే 17, 2025
పరీక్ష తేదీ: మే 18, 2025
పేపర్ 1: ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు
పేపర్ 2: మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు
అభ్యర్థుల రెస్పాన్స్ కాపీ అందుబాటు తేదీ : మే 22, 2025
తాత్కాలిక ఆన్సర్ కీ విడుదల ఎప్పుడంటే : మే 26, 2025
ఫీడ్‌బ్యాక్ విండో: మే 26, 2025 నుంచి మే 27, 2025 (సాయంత్రం 5:00 గంటల వరకు)
ఫలితాలు, ఫైనల్ ఆన్సర్ కీ విడుదల: జూన్ 2, 2025
JEE అడ్వాన్స్‌డ్ 2025: పరీక్షా విధానం
JEE అడ్వాన్స్‌డ్ 2025 పరీక్ష రెండు పేపర్‌లను కలిగి ఉంటుంది: పేపర్ 1, పేపర్ 2. రెండు పేపర్‌లు ఒకే రోజు, అంటే మే 18, 2025న నిర్వహించబడతాయి.
పేపర్ 1: ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు (3 గంటలు)
పేపర్ 2: మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు (3 గంటలు)
రెండు పేపర్‌లలోనూ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) రూపంలో నిర్వహించబడుతుంది.
అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్
అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ మే 11, 2025 నుంచి మే 18, 2025 (మధ్యాహ్నం 2:30 గంటల వరకు) అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ jeeadv.ac.in నుంచి తమ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ ఉపయోగించి అడ్మిట్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
Stock Market Rally: ఓ వైపు ట్రెడ్ వార్..అయినప్పటికీ భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్లు
China Warning: మా ప్రయోజనాలపై దాడి చేస్తే ఊరుకోం..అమెరికాకు చైనాహెచ్చరిక
Elon Musk: తల్లి బర్త్ డేకు సర్‌ప్రైజ్ చేసిన ఎలాన్ మస్క్..ఎలాగో తెలుసా..
Viral News: 70 ఇన్ స్పేస్..అంతరిక్షంలో రోదసీ యాత్రికుడి బర్త్ డే సెలబ్రేషన్
Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..
Bill Gates: వారానికి మూడు రోజేలే పని..బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Read More Business News and Latest Telugu News