Indian Army: ఇండియన్ ఆర్మీలో యువతకు జాబ్ ఆఫర్స్.. నెలకు రూ.2 లక్షల జీతం..
ABN , Publish Date - May 16 , 2025 | 04:38 PM
ఇండియన్ ఆర్మీలో యువతకు అదిరిపోయే జాబ్ ఆఫర్స్ వచ్చేశాయి. 12వ తరగతి తర్వాత నేరుగా ఆర్మీ ఆఫీసర్లు కావాలనుకునే యువతకు ఇది మంచి ఛాన్స్ అని చెప్పవచ్చు. ఈ పోస్టులకు ఏకంగా రెండు లక్షల వరకు శాలరీ ఉండటం విశేషం.

ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం కోసం చూస్తున్న యువతకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ క్రమంలోనే ఇటీవల ఇండియన్ ఆర్మీ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ (Indian Army TES) జనవరి 2026 రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ నియామకాల కోసం దరఖాస్తు ప్రక్రియ మే 13, 2025 నుంచి మొదలు కాగా, దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూన్ 12, 2025గా ప్రకటించారు. ఈ నియామక ప్రక్రియ ద్వారా, మొత్తం 90 పోస్టులను భర్తీ చేస్తారు. అయితే ఈ పోస్టులకు అప్లై చేయాలంటే వయస్సు ఎంత ఉండాలి, వేతనాలు ఎలా ఉంటాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
విద్యా అర్హత
వీటికి దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 60% మార్కులతో PCM (ఫిజిక్స్, కెమిస్ట్రీ & మ్యాథ్స్)తో (10+2) ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో పాటు అభ్యర్థులు JEE (మెయిన్స్) 2025 పరీక్షకు హాజరై ఉండాలి.
వయో పరిమితి
దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థుల వయస్సు పదహారున్నర సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు. గరిష్ట వయస్సు పంతొమ్మిదిన్నర సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. అభ్యర్థుల పుట్టిన తేదీలు 2 జూలై 2006 కి ముందు, 1 జూలై 2009 తర్వాత ఉండకూడదు.
ఇండియన్ ఆర్మీ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన పత్రాలు
10వ తరగతి సర్టిఫికేట్, ఒరిజినల్ మార్క్ షీట్
12వ తరగతి సర్టిఫికేట్, ఒరిజినల్ మార్క్ షీట్
ఒరిజినల్ ఐడి ప్రూఫ్
JEE మెయిన్స్ ఫలితం 2025 కాపీ
ఈ నియామకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే
అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక నోటిఫికేషన్లో నియామక అర్హత, విద్యా అర్హతలను ఓసారి తనిఖీ చేసుకుని అప్లై చేయాలి.
వీటి కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు joinindianarmy.nic.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ వెబ్ సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు హోమ్ పేజీలో ఇవ్వబడిన అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయండి
ఇప్పుడు మీరు రిజిస్టర్ చేసుకోవాలి
ఆ తర్వాత మీరు లాగిన్ అయి మీ వివరాలను నమోదు చేయండి
ఫాం ఫిల్ చేసిన తర్వాత ఓసారి తనిఖీ చేయండి
అప్లై చేసిన తర్వాత ఆ ఫాం డౌన్లోడ్ చేసుకుని, భవిష్యత్తు అవసరాల కోసం ప్రింటవుట్ తీసుకోండి
ఇవి కూడా చదవండి
Penny Stock: ఐదేళ్లలోనే రూ.15 నుంచి రూ.246కి చేరిన స్టాక్..ఇన్వెస్టర్లకు లాభాలే లాభాలు..
NRI Money Transfer Tax: ఎన్నారైలకు షాకింగ్ న్యూస్.. విదేశాలకు మనీ పంపిస్తే బాదుడేనా..
Investment Tips: ఒకేసారి రూ.3.5 లక్షల పెట్టుబడి..కానీ వచ్చేది మాత్రం కోటి, ఎలాగంటే..
Penny Stock: ఈ స్టాక్‌పై రూ.4 లక్షల పెట్టుబడి..ఏడేళ్ల లోనే రూ.56 లక్షల లాభం..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి