Share News

India Post GDS Recruitment 2025: ఇండియా పోస్ట్ GDS రిక్రూట్‌మెంట్ 2025.. 4వ మెరిట్ జాబితా విడుదల..

ABN , Publish Date - Jun 17 , 2025 | 07:29 PM

ఇండియా పోస్ట్ GDS రిక్రూట్‌మెంట్ 2025 కోసం 4వ మెరిట్ జాబితాను విడుదల చేసింది. ఎంపిక అయిన అభ్యర్థులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తోపాటు ఇతర వివరాలను indiapostgdsonline.gov.in ద్వారా తెలుసుకోచ్చు.

India Post GDS Recruitment 2025: ఇండియా పోస్ట్ GDS రిక్రూట్‌మెంట్ 2025.. 4వ మెరిట్ జాబితా విడుదల..
India Post GDS Recruitment 2025

India Post GDS Recruitment 2025: ఇండియా పోస్ట్ 2025కి సంబంధించి గ్రామీణ డాక్ సేవక్ (GDS) నియామకానికి నాల్గవ మెరిట్ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాను అధికారిక వెబ్‌సైట్ indiapostgdsonline.gov.in లో చెక్‌ చేసుకోవచ్చు. బ్రాంచ్ పోస్టుమాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టుమాస్టర్ (ABPM), డాక్ సేవక్ లాంటి పోస్టులకు ఎంపిక చేసిన అభ్యర్థుల వివరాలు ఇందులో ఉన్నాయి. 10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా వీరిని ఎంపిక చేశారు. దీనికి ఎటువంటి పరీక్ష ఉండదు.


మెరిట్ జాబితా ఎలా చూడాలి?

  • అప్లై చేసిన అభ్యర్థులు indiapostgdsonline.gov.in వెబ్‌సైట్‌కి వెళ్ళండి.

  • Candidate Corner సెక్షన్‌ క్లిక్ చేయండి.

  • అక్కడ ‘GDS Online Engagement’ క్లిక్ చేయాలి

  • మీ రాష్ట్రానికి సంబంధించిన Supplementary List-IV డౌన్‌లోడ్ చేసుకోవాలి

ఈ మెరిట్ జాబితాలో అభ్యర్థుల పేర్లు, రిజిస్ట్రేషన్ నంబర్లు, సాధించిన మార్కులు, ఎంపికైన శాఖ వివరాలు ఉంటాయి. మెరిట్ జాబితాలో పేరు ఉన్న అభ్యర్థులకు వారికి సంబంధించిన డివిజన్ లేదా పోస్టాఫీస్ నుంచి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం సమాచారం వస్తుంది. దాని ప్రకారం కావాల్సిన సర్టిఫికెట్లు తీసుకోని డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు వెళ్లండి.


తీసుకురావాల్సిన డాక్యుమెంట్లు ఇవే:

  • 10వ తరగతి మార్క్ లిస్ట్

  • పుట్టిన తేదీ సర్టిఫికెట్

  • కుల/కేటగిరీ సర్టిఫికేట్

  • కంప్యూటర్ కోర్సు సర్టిఫికేట్

  • ఆధార్ / ఓటరు ID

  • పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు (2)

ఎంపికైన అభ్యర్థులు తప్పకుండా పైన పేర్కొన్న సర్టిఫికెట్లను చెప్పిన తేది ప్రకారంగా తీసుకెళ్లాలి. వీటిలో ఏదైనా మిస్ అయినా మీకు వచ్చిన ఉద్యోగ అవకాశం పోతుంది. కాబట్టి, ముందేగానే అన్నీ సిద్ధంగా ఉంచుకోవడం మంచిది. ఇండియా పోస్ట్ నుంచి వచ్చే SMSలు, ఈమెయిల్స్, లేదా అధికారిక వెబ్‌సైట్‌ అప్డేట్స్‌ను తరచూ చెక్ చేస్తూ ఉండాలి. అప్పుడే ముఖ్యమైన సమాచారం మిస్ కాకుండా చూసుకోవచ్చు.


Also Read:

2025 గ్లోబల్ సర్వే.. ప్రపంచంలోనే బెస్ట్ సిటీ ఇదే..!

నో ఫ్లైయింగ్ జోన్‌గా అమర్‌నాథ్ యాత్రా మార్గాలు

For More National News

Updated Date - Jun 17 , 2025 | 08:09 PM